ఆయుష్షుకే

వృద్ధాప్యంలో హాయిగా, ఆరోగ్యంగా ఉండాలని.. ఎక్కువ కాలం జీవించాలని కోరుకుంటున్నారా? అయితే విటమిన్‌ కె లోపం తలెత్తకుండా చూసుకోండి. రక్తంలో విటమిన్‌ కె మోతాదులు తగినంత గలవారితో పోలిస్తే.. తగ్గినవారికి మరణించే ముప్పు 19% అధికంగా ఉంటున్నట్టు టఫ్ట్స్‌ యూనివర్సిటీ తాజా అధ్యయనంలో బయటపడింది.

Published : 30 Jun 2020 01:25 IST

వృద్ధాప్యంలో హాయిగా, ఆరోగ్యంగా ఉండాలని.. ఎక్కువ కాలం జీవించాలని కోరుకుంటున్నారా? అయితే విటమిన్‌ కె లోపం తలెత్తకుండా చూసుకోండి. రక్తంలో విటమిన్‌ కె మోతాదులు తగినంత గలవారితో పోలిస్తే.. తగ్గినవారికి మరణించే ముప్పు 19% అధికంగా ఉంటున్నట్టు టఫ్ట్స్‌ యూనివర్సిటీ తాజా అధ్యయనంలో బయటపడింది. ఇలాంటివాళ్లు 13 ఏళ్ల ముందుగానే మరణిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. మొత్తం 4వేల మందిని (54-76 ఏళ్ల వయసువారిని) 13 ఏళ్ల పాటు పరిశీలించి ఈ విషయాన్ని కనుగొన్నారు. రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్‌ కె చాలా అవసరం. మన రక్తనాళాల కణజాలంలోని కొన్ని ప్రొటీన్లు ఉంటాయి. ఇవి రక్తనాళాల గోడల్లో క్యాల్షియం పోగు పడకుండా కాపాడుతుంటాయి. విటమిన్‌ కె లోపిస్తే ఈ ప్రొటీన్ల పనితీరు దెబ్బతింటుందని పరిశోధకులు చెబుతున్నారు. రబ్బరు బ్యాండు ఎండిపోతే సాగే గుణం తగ్గుతుంది కదా. అలాగే రక్తనాళాల్లో క్యాల్షియం పోగుపడితే గట్టిపడతాయి. సాగే గుణం తగ్గుతుంది. దీంతో రక్త ప్రసరణ దెబ్బతిని, రకరకాల సమస్యలకు దారితీస్తుంది. పాలకూర వంటి ఆకుకూరలు.. కొన్ని వంటనూనెల్లో ముఖ్యంగా సోయాబీన్‌ నూనె, తవుడు నూనె వంటి వాటిల్లో విటమిన్‌ కె దండిగా ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని