చిగుళ్ల నుంచి రక్తమా?

చిగుళ్లవాపు తొలిదశలో (జింజివైటిస్‌) చిగుళ్ల నుంచి రక్తం రావటం మామూలే. కానీ ఇది ఆహారంలో విటమిన్‌ సి లోపించిందనటానికీ సంకేతం కావొచ్చు. దీంతో చిగుళ్లను, దంతాలను నెమ్మదిగా తాకినా, తోమినా రక్తం వచ్చే ముప్పు పెరుగుతుంది.

Published : 08 Jun 2021 01:23 IST

చిగుళ్లవాపు తొలిదశలో (జింజివైటిస్‌) చిగుళ్ల నుంచి రక్తం రావటం మామూలే. కానీ ఇది ఆహారంలో విటమిన్‌ సి లోపించిందనటానికీ సంకేతం కావొచ్చు. దీంతో చిగుళ్లను, దంతాలను నెమ్మదిగా తాకినా, తోమినా రక్తం వచ్చే ముప్పు పెరుగుతుంది. విటమిన్‌ లోపంతో తలెత్తే స్కర్వీ జబ్బులో చిగుళ్ల నుంచి రక్తం రావటం తెలిసిందే. స్కర్వీ ఇప్పుడు అరుదే అయినా విటమిన్‌ సి మోతాదులకు, చిగుళ్ల నుంచి రక్తం పడటానికి సంబంధం ఉంటున్నట్టు తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయితే దీనికి పెద్దగా భయపడాల్సిన పనేమీ లేదు. తగినంత విటమిన్‌ సి లభించేలా చూసుకుంటే పూర్తిగా తగ్గించుకోవచ్చు. పెద్దవాళ్లకు రోజుకు 90 ఎంజీ విటమిన్‌ సి అవసరం. పళ్లు తోముతున్నప్పుడు, సన్నటి దారంతో పళ్ల మధ్య శుభ్రం చేసుకుంటున్నప్పుడు రక్తం వస్తుంటే పళ్ల డాక్టర్‌ను సంప్రదించాల్సిందే. కానీ విటమిన్‌ సి ఎక్కువగా లభించే బత్తాయిలు, నారింజ, జామ, కివీ వంటి పండ్లను తీసుకోవటమూ ముఖ్యమేనని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే రోజుకు 100-200 ఎంజీ విటమిన్‌ సి మాత్రలైనా వేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని