గుండెవాపు ఎందుకు?

మనకేదైనా గాయమైనప్పుడు, ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) ప్రేరేపితమవుతుంది. ఆయా సమస్యలు తగ్గాక ఇదీ కుదురుకుంటుంది. కానీ కొందరిలో కణస్థాయిలో కొనసాగుతూనే వస్తుంటుంది....

Updated : 31 Aug 2021 06:38 IST

నకేదైనా గాయమైనప్పుడు, ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) ప్రేరేపితమవుతుంది. ఆయా సమస్యలు తగ్గాక ఇదీ కుదురుకుంటుంది. కానీ కొందరిలో కణస్థాయిలో కొనసాగుతూనే వస్తుంటుంది. ఇది తీవ్ర సమస్యలకు దారితీయొచ్చు. గుండెలో వాపు ప్రక్రియతో అక్కడి కండరం మందం కావొచ్చు. దీన్నే మయోకార్డయిటిస్‌ అంటారు. ఇది గుండె చిన్న, పెద్ద భాగాల్లో ఎక్కడైనా తలెత్తొచ్చు. తీవ్రమైతే గుండె లయ అస్తవ్యస్తం కావటం, ఆయాసం, కాళ్లు చేతులు ఉబ్బటం వంటి ఇబ్బందులూ బయలుదేరొచ్చు. గుండె కండరం మందం కావటానికి చాలావరకు వైరల్‌ ఇన్‌ఫెక్షన్లే కారణం. బ్యాక్టీరియా, ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లూ ఇందుకు దోహదం చేయొచ్చు. రోగనిరోధకశక్తి పొరపాటున గుండె కణజాలం మీద దాడి చేయటం, కొన్నిరకాల మందులూ దీనికి దారితీయొచ్చు. మయోకార్డయిటిస్‌ స్వల్పంగా ఉంటే విశ్రాంతి తీసుకుంటూ తరచూ డాక్టర్‌ను సంప్రదిస్తూ జాగ్రత్తగా ఉంటే చాలు. అదే తీవ్రమైతే మందులు అవసరమవుతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని