పొగతాగని వారిలో ఊపిరితిత్తి క్యాన్సర్‌ నయం!

ఊపిరితిత్తి క్యాన్సర్‌లో పొగ తాగటం కీలక పాత్ర పోషించే మాట నిజమే. అలాగని పొగ తాగని వారికి రాకూడదనేమీ లేదు. అయితే పొగ తాగనివారిలో ఊపిరితిత్తి క్యాన్సర్‌ స్వభావం భిన్నంగా

Updated : 05 Oct 2021 03:16 IST

పిరితిత్తి క్యాన్సర్‌లో పొగ తాగటం కీలక పాత్ర పోషించే మాట నిజమే. అలాగని పొగ తాగని వారికి రాకూడదనేమీ లేదు. అయితే పొగ తాగనివారిలో ఊపిరితిత్తి క్యాన్సర్‌ స్వభావం భిన్నంగా ఉంటున్నట్టు వాషింగ్టన్‌ యూనివర్సిటీ అధ్యయనం చెబుతోంది. కొత్త చికిత్స పద్ధతితో దీన్ని నయం చేసే అవకాశముందనీ సూచిస్తోంది. పొగ అలవాటు లేనివారి ఊపిరితిత్తుల్లో తలెత్తిన కణితుల్లో కొన్ని ప్రత్యేకమైన జన్యుమార్పులు ఉంటున్నట్టు, వీటిపై గురి చూసి పనిచేసే మందులతో 78 నుంచి 92 శాతం మందికి మంచి ఫలితం కనిపిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ మందుల వాడకానికి ఇప్పటికే అమెరికా ఎఫ్‌డీఏ అనుమతి లభించి ఉండటం గమనార్హం. ఊపిరితిత్తి క్యాన్సర్‌లో జన్యు స్వభావాలపై జరిగే అధ్యయనాలు చాలావరకు పొగ తాగేవారి మీదే దృష్టి పెడుతుంటాయి. పొగ తాగనివారి మీద నిర్వహించే అధ్యయనాల్లోనూ కణితుల్లో పుట్టుకొచ్చే కచ్చితమైన జన్యుమార్పులను అంతగా పరిశీలించరు. ఇలాంటి కణితుల్లో పుట్టుకొచ్చే జన్యుమార్పులను మందులతో తగ్గించే అవకాశం లేకపోలేదని పరిశోధకులు చెబుతున్నారు. కాకపోతే అధునాతన బయాప్సీ పద్ధతులతో ఆయా జన్యుమార్పులను కచ్చితంగా గుర్తించటం చాలా చాలా ముఖ్యమని వివరిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని