అల్జీమర్స్‌ గుట్టు రట్టు!

అల్జీమర్స్‌ ఎందుకొస్తున్నది ఇప్పటికీ కచ్చితంగా తెలియదు. మెదడులో ప్రొటీన్‌ గార పోగుపడటం దీనికి మూలమని భావిస్తున్నారు. మెదడు కణాలు తమను తాము శుభ్ర పరచుకునే సామర్థ్యం మందగించటం దీనికి కారణమవుతున్నట్టు

Updated : 30 Sep 2022 12:08 IST

ల్జీమర్స్‌ ఎందుకొస్తున్నది ఇప్పటికీ కచ్చితంగా తెలియదు. మెదడులో ప్రొటీన్‌ గార పోగుపడటం దీనికి మూలమని భావిస్తున్నారు. మెదడు కణాలు తమను తాము శుభ్ర పరచుకునే సామర్థ్యం మందగించటం దీనికి కారణమవుతున్నట్టు యూసీ రివర్‌సైడ్‌ పరిశోధకుల తాజా అధ్యయనం పేర్కొంటోంది. మెదడులో గార పోగు పడినప్పటికీ సుమారు 20% మందిలో మతిమరుపు లక్షణాలేవీ కనిపించటం లేదు. అందుకే ఇదొక్కటే కారణం కాకపోవచ్చనే దృష్టితో పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. మెదడులో పోగుపడే గారలో రెండు రకాల ప్రొటీన్లుంటాయి. అమీలాయిడ్‌ ప్రొటీన్‌ మెదడు కణాల చుట్టూరా.. టావ్‌ ప్రొటీన్‌ మెదడు కణాల లోపల పోగుపడతాయి. సాధారణంగా టావ్‌ ప్రొటీన్లు మెదడులోని నాడీ కణాల అంతర్గత నిర్మాణం స్థిరంగా ఉండటానికి తోడ్పడతాయి. కానీ వీటి పనితీరు అస్తవ్యస్తం కావటం వల్ల గట్టిపడి, గారగా మారుతుంది. మెదడులో ఇలాంటి గార పోగుపడినవారిలో డిమెన్షియా తలెత్తినట్టు పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా గతి తప్పిన, అస్తవ్యస్త  ప్రొటీన్లను శరీరం తనకు తాను నిర్మూలించుకుంటుంది. దీన్నే ఆటోఫేజీ అంటారు. అయితే 65 ఏళ్లు దాటినవారిలో ఈ ప్రక్రియ నెమ్మదిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని