పక్కవారి పొగతో కీళ్లవాతం!

పొగ తాగటమే కాదు, పక్కవారు వదిలిన సిగరెట్ల పొగను పీల్చినా ప్రమాదమే. పిల్లలకు ఇది పెద్ద సమస్యనే తెచ్చిపెడుతున్నట్టు తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. బాల్యంలో ఇతరులు వదిలిన సిగరెట్‌ పొగ ప్రభావానికి

Updated : 28 Dec 2021 05:45 IST

పొగ తాగటమే కాదు, పక్కవారు వదిలిన సిగరెట్ల పొగను పీల్చినా ప్రమాదమే. పిల్లలకు ఇది పెద్ద సమస్యనే తెచ్చిపెడుతున్నట్టు తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. బాల్యంలో ఇతరులు వదిలిన సిగరెట్‌ పొగ ప్రభావానికి గురైన ఆడపిల్లలకు పెద్దయ్యాక కీళ్లవాతంతో ముడిపడిన కీళ్ల నొప్పులు (రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌) తలెత్తే ముప్పు పెరుగుతున్నట్టు బయటపడింది. పెద్దయ్యాక సిగరెట్లు కూడా తాగితే ముప్పు ఇంకా పెరుగుతోంది. ధూమపానానికీ రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌కూ ప్రత్యక్ష సంబంధం ఉంటున్నట్టు తేలిన మొదటి అధ్యయనం ఇదే. రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌ స్వీయ రోగనిరోధక (మన రోగనిరోధక కణాలు మన కీళ్ల కణజాలం మీదే దాడి చేయటం) సమస్య. దీనికి కారణమేంటన్నది తెలియదు. జన్యువులు, హార్మోన్లు, పర్యావరణ అంశాల వంటివి దోహదం చేయొచ్చు. ధూమపానంతోనూ దీని ముప్పు పెరుగుతుంది. అయితే ఇతరులు వదిలిన పొగను పీల్చినా ప్రమాదం ముంచుకొస్తున్నట్టు తాజాగా బయటపడటం గమనార్హం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని