చిరచిర తగ్గాలంటే?

కొందరికి పడుకున్నప్పుడు కాళ్లలో చిరచిరగా, ఏదో అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. దీన్నే రెస్ట్‌లెస్‌ లెగ్స్‌ సిండ్రోమ్‌ (ఆర్‌ఎల్‌ఎస్‌) అంటారు. దీనికి ప్రధాన కారణం- మెదడులో ఆయా భాగాలకు సంబంధించిన భాగాలు, సమాచారాన్ని చేరవేసే మార్గాలు అతిగా స్పందించటమే. ఇది కాళ్లకే పరిమితం కావాలనేమీ లేదు.

Updated : 29 Mar 2022 06:00 IST

కొందరికి పడుకున్నప్పుడు కాళ్లలో చిరచిరగా, ఏదో అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. దీన్నే రెస్ట్‌లెస్‌ లెగ్స్‌ సిండ్రోమ్‌ (ఆర్‌ఎల్‌ఎస్‌) అంటారు. దీనికి ప్రధాన కారణం- మెదడులో ఆయా భాగాలకు సంబంధించిన భాగాలు, సమాచారాన్ని చేరవేసే మార్గాలు అతిగా స్పందించటమే. ఇది కాళ్లకే పరిమితం కావాలనేమీ లేదు. తీవ్రమైతే చేతుల వంటి భాగాలకూ విస్తరించొచ్చు. కాబట్టి నిర్లక్ష్యం చేయరాదు. పడుకునే ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం, ఇష్టమైన పుస్తకం చదవటం మేలు. ఇవి మానసిక ప్రశాంతత చేకూర్చి చిరచిర తగ్గటానికి తోడ్పడతాయి. నెమ్మదిగా కండరాలను సాగదీయటం, కాసేపు నడవటమూ మేలు చేస్తాయి. కావాలంటే కాళ్ల మీద బరువైన దుప్పటి కప్పుకోవచ్చు. కాళ్లను నెమ్మదిగా మర్దన చేసుకోవచ్చు. చిరచిర ఎక్కువయ్యేలా చేసే మద్యం, కెఫీన్‌, నికొటిన్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని