థైరాయిడ్‌ మతిమరుపు

థైరాయిడ్‌ గ్రంథి సరిగా పనిచేయని (హైపోథైరాయిడిజమ్‌) వృద్ధులకు మతిమరుపు (డిమెన్షియా) ముప్పు పెరిగే అవకాశముందని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. థైరాయిడ్‌ గ్రంథి సరిగా

Updated : 31 Aug 2023 21:33 IST

థైరాయిడ్‌ గ్రంథి సరిగా పనిచేయని (హైపోథైరాయిడిజమ్‌) వృద్ధులకు మతిమరుపు (డిమెన్షియా) ముప్పు పెరిగే అవకాశముందని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. థైరాయిడ్‌ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు దీన్నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ల మోతాదులు తగ్గుతాయి. దీంతో జీవక్రియల వేగం నెమ్మదిస్తుంది. అలసట, బరువు పెరగటం, చలి పెట్టటం వంటి లక్షణాలూ ఉంటాయి. కొందరిలో ఇది మతిమరుపునూ తెచ్చిపెట్టొచ్చని అధ్యయనానికి నేతృత్వం వహించిన చీన్‌-సియాంగ్‌ వెంగ్‌ చెబుతున్నారు. ఇందులో తేలిన ఫలితాలను నిర్ధరించటానికి మరిన్ని అధ్యయనాలు చేయాల్సిన అవసరముందనీ అంటున్నారు. ఏదేమైనా హైపోథైరాయిడిజమ్‌తో మతిమరుపు వచ్చే అవకాశముందని గ్రహించటం ముఖ్యమని వివరిస్తున్నారు. థైరాయిడ్‌ హార్మోన్‌ మాత్రలు వేసుకునేవారితో పోలిస్తే వేసుకునేవారికి మతిమరుపు ముప్పు మరింత ఎక్కువగా ఉంటుండటం గమనార్హం. దీనర్థం మందులతో మతిమరుపు వస్తుందని కాదు. హైపోథైరాయిడిజమ్‌ లక్షణాలు ఎక్కువగా గలవారికి చికిత్స అవసరమవటం కారణం కావొచ్చని భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని