దీర్ఘ కొవిడ్‌ మూలమేంటి?

కొవిడ్‌-19 బాధితుల్లో చాలామంది ఒకట్రెండు వారాల్లోనే కోలుకుంటున్నారు. కానీ కొందరిని దీర్ఘకాలం వెంటాడుతోంది (లాంగ్‌ కొవిడ్‌). వారాలు, నెలల తరబడి దగ్గు, ఆయాసం వంటివి వేధిస్తూనే వస్తున్నాయి.

Published : 26 Jul 2022 01:04 IST

కొవిడ్‌-19 బాధితుల్లో చాలామంది ఒకట్రెండు వారాల్లోనే కోలుకుంటున్నారు. కానీ కొందరిని దీర్ఘకాలం వెంటాడుతోంది (లాంగ్‌ కొవిడ్‌). వారాలు, నెలల తరబడి దగ్గు, ఆయాసం వంటివి వేధిస్తూనే వస్తున్నాయి. దీనికి ఇంటర్‌స్టీషియల్‌ లంగ్‌ డిసీజ్‌ (ఐఎల్‌డీ) కారణమవుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా సాన్‌ డీగో పరిశోధకులు గుర్తించారు. దీర్ఘ కొవిడ్‌తో గట్టిపడుతున్న ఊపిరితిత్తుల కణజాలం ఇడియోపతిక్‌ పల్మనరీ ఫైబ్రోసిస్‌(ఐపీఎఫ్‌)ను పోలి ఉంటున్నట్టు కనుగొన్నారు. ఐఎల్‌డీ రకాల్లో అతి ప్రమాదకరమైంది, ఎక్కువమందిలో కనిపించేది ఇదే. ఊపిరితిత్తుల్లోని గాలిగదుల కణాల (ఏటీ2 కణాలు) పనితీరూ అస్తవ్యస్తమవుతున్నట్టు బయటపడింది. ఊపిరితిత్తులు కుప్పకూలిపోకుండా చూసే ఈ కణాలు విఫలం కావటం వల్ల మొత్తంగా ఊపిరితిత్తుల పనితీరే దెబ్బతింటోందన్నమాట. దీర్ఘ కొవిడ్‌ను బాగా అర్థం చేసుకోవటానికిది తోడ్పడగలదని భావిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని