పేగుల్లో వాపుతోనూ కీళ్లనొప్పులు!

కీళ్లనొప్పులు ఎముకల సమస్యలే. కానీ కొన్నిసార్లు వీటికి పేగుల్లో వాపుప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) ప్రేరేపితం కావటమూ కారణం కావొచ్చు. మన రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మన మీదే దాడిచేయటం

Updated : 09 Aug 2022 01:01 IST

కీళ్లనొప్పులు ఎముకల సమస్యలే. కానీ కొన్నిసార్లు వీటికి పేగుల్లో వాపుప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) ప్రేరేపితం కావటమూ కారణం కావొచ్చు. మన రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మన మీదే దాడిచేయటం వల్ల తలెత్తే సమస్యలకు (ఆటోఇమ్యూన్‌) పేగుల్లో పూత ఒక ఉదాహరణ. అల్సరేటివ్‌ కొలైటిస్‌, క్రాన్స్‌ వంటి జబ్బులకు కారణం ఇదే. మొత్తంగా వీటిని ఇన్‌ఫ్లమేటరీ బవెల్‌ డిసీజ్‌ (ఐబీడీ) అని పిలుస్తారు. అయితే దీని ఇబ్బందులు పేగులకే పరిమితమవుతాయని అనుకోవటానికి లేదు. కొందరిలో కీళ్లనొప్పులకూ దారితీయొచ్చు. ఐబీడీతో బాధపడేవారిలో 7-20 శాతం మందిలో ఇలాంటిది చూస్తుంటాం. దీన్నే ఇన్‌ఫ్లమేటరీ బవెల్‌ ఆర్థ్రయిటిస్‌ అంటారు. ఇటీవల విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలతో పాటు కీళ్లనొప్పులూ మొదలైతే పేగుల్లో వాపు, పూత కారణమై ఉండొచ్చని భావించొచ్చు. దీనికి స్టిరాయిడ్లు, నొప్పిని తగ్గించే మందులు ఉపయోగపడతాయి. పేగుల్లో వాపు ప్రక్రియ అదుపులో ఉంటే నొప్పులూ తగ్గుతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని