గుర్తించండి ఫాస్ట్‌గా

పక్షవాతం లక్షణాలను చాలామంది విస్మరిస్తుంటారు. అవి పక్షవాతం లక్షణాలు కాకపోవచ్చని పొరపడుతుంటారు. సమస్య తీవ్రం కావటానికిదే దోహదం చేస్తుంటుంది. కాబట్టి శరీరం అందించే సంకేతాలను గ్రహించాలి. అంతే వేగంగా స్పందించాలి.

Published : 01 Nov 2022 00:09 IST

క్షవాతం లక్షణాలను చాలామంది విస్మరిస్తుంటారు. అవి పక్షవాతం లక్షణాలు కాకపోవచ్చని పొరపడుతుంటారు. సమస్య తీవ్రం కావటానికిదే దోహదం చేస్తుంటుంది. కాబట్టి శరీరం అందించే సంకేతాలను గ్రహించాలి. అంతే వేగంగా స్పందించాలి.

* శరీరంలో ఒకవైపు బలహీనంగా అనిపించటం

* ముఖం మొద్దుబారటం

* నోరు ఒకవైపునకు జారటం, మాట తడబడటం

* అసాధారణ, తీవ్రమైన తలనొప్పి

* చూపు మందగించటం, పోవటం

* మొద్దుబారినట్టు, సూదులు పొడుస్తున్నట్టు అనిపించటం

* నడుస్తున్నప్పుడు తూలటం

* ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయరాదు. వీలైనంత త్వరగా ఆసుపత్రికి వెళ్లాలి. పక్షవాతానికి ఎంత త్వరగా చికిత్స ఆరంభిస్తే అంత మంచి ఫలితం కనిపిస్తుందని తెలుసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు