సూక్ష్మంతో మోక్షం!

పేరుకు పేగుపూత (ఇన్‌ఫ్లమేటరీ బవెల్‌ డిసీజ్‌- ఐబీడీ) ఒకటే సమస్య. కానీ ఇందులో రెండు రకాలున్నాయి. 1. క్రోన్స్‌ డిసీజ్‌. 2. అల్సరేటివ్‌ కొలైటిస్‌. తరచూ విరేచనాలు, కడుపు నొప్పి, మలంలో రక్తం, బరువు తగ్గటం, నీరసం వంటి వాటితో ఇవి తెగ ఇబ్బంది పెడతాయి.

Updated : 20 Dec 2022 00:42 IST

పేరుకు పేగుపూత (ఇన్‌ఫ్లమేటరీ బవెల్‌ డిసీజ్‌- ఐబీడీ) ఒకటే సమస్య. కానీ ఇందులో రెండు రకాలున్నాయి. 1. క్రోన్స్‌ డిసీజ్‌. 2. అల్సరేటివ్‌ కొలైటిస్‌. తరచూ విరేచనాలు, కడుపు నొప్పి, మలంలో రక్తం, బరువు తగ్గటం, నీరసం వంటి వాటితో ఇవి తెగ ఇబ్బంది పెడతాయి. దీర్ఘకాలం వేధిస్తాయి. ఐబీడీకి పెద్దగా చికిత్సలు అందుబాటులో లేకపోవటం మరో చిక్కు. దీన్ని దృష్టిలో పెట్టుకునే యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌-మాడిసన్‌ పరిశోధకులు.. ఆక్సిజన్‌తో కూడిన అస్థిర అణువులను (ఆర్‌ఓఎస్‌) నిర్వీర్యం చేసే పాలిమర్‌.. మందుల తయారీలో వాడే హైయాలురోనిక్‌ యాసిడ్‌తో నానోపార్టికల్స్‌ను రూపొందించారు. వీటిని ప్రొబయోటిక్స్‌కు జతచేసి పేగుల్లోకి జొప్పించొచ్చు. అప్పుడు ప్రొబయోటిక్స్‌ నెమ్మదిగా విడుదలవుతూ మంచి బ్యాక్టీరియాను వృద్ది చేస్తాయి. ఫలితంగా పేగుపూత లక్షణాలు తగ్గుముఖం పడతాయి. ఐబీడీ గలవారిలో జీర్ణ రసాలు, బైల్‌ లవణం చాలావరకు ప్రొబయోటిక్స్‌ను చంపేస్తాయి. పైగా ఐబీడీ చికిత్సలో ఇచ్చే యాంటీబయోటిక్స్‌ కూడా ప్రొబయోటిక్స్‌ వృద్ధిని అడ్డుకుంటాయి. ఇలాంటి దుష్ప్రభావాలు తగ్గటానికి కొత్త నానోపార్టికల్స్‌ ఉపయోగపడగలవని భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు