కీళ్లవాతానికి వేడి కాపు

కీళ్లవాతం గలవారిలో కీళ్ల ఉబ్బు, బిగుసుకుపోవటం తెగ ఇబ్బంది పెడతాయి. దీనికి మందులు వేసుకోవటం ముఖ్యమే గానీ ఇంటి చిట్కాలూ మేలు చేస్తాయి

Published : 07 Mar 2023 00:26 IST

కీళ్లవాతం గలవారిలో కీళ్ల ఉబ్బు, బిగుసుకుపోవటం తెగ ఇబ్బంది పెడతాయి. దీనికి మందులు వేసుకోవటం ముఖ్యమే గానీ ఇంటి చిట్కాలూ మేలు చేస్తాయి. ముఖ్యంగా వేడి కాపడం, ఐస్‌ ముక్కలతో అద్దటం నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వేడి కాపుతో కీళ్లకు రక్త ప్రసరణ పుంజుకుంటుంది. బిగుసుకుపోవటం తగ్గుతుంది. ఐస్‌ ముక్కలతో అద్దితే వాపు ప్రక్రియ, ఉబ్బు తగ్గుముఖం పడతాయి. ఆయా లక్షణాలను బట్టి వీటిని వాడుకోవచ్చు. రోజులో చాలాసార్లు వేడి కాపడం, ఐస్‌ అద్దటం చేసుకోవచ్చు గానీ ఒకసారి 15-20 నిమిషాల కన్నా ఎక్కువసేపు మించనీయొద్దు. సొరియాసిస్‌తో ముడిపడిన కీళ్లవాతం గలవారికి పసుపుతోనూ ఉపశమనం లభిస్తుంది. ఇది మంచి యాంటీఆక్సిడెంట్‌. ఇందులో వాపు నివారణ గుణాలూ ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని