వినికిడి సాధనం వాడొచ్చా?
నాకు 24 ఏళ్లు. చిన్నప్పటి నుంచి నాడులు దెబ్బతినటం వల్ల వినికిడి లోపించింది. మాటలు స్పష్టంగా వినిపించవు. చాలావరకు టీచర్ల పెదవుల కదలికలను బట్టి పాఠాలు అర్థం చేసుకున్నాను.
సమస్య సలహా
సమస్య: నాకు 24 ఏళ్లు. చిన్నప్పటి నుంచి నాడులు దెబ్బతినటం వల్ల వినికిడి లోపించింది. మాటలు స్పష్టంగా వినిపించవు. చాలావరకు టీచర్ల పెదవుల కదలికలను బట్టి పాఠాలు అర్థం చేసుకున్నాను. ఇటీవల ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు మాటలు సరిగా వినిపించలేదు. డాక్టర్‌ను కలిస్తే వినికిడి యంత్రం పెట్టుకోవాలని సూచించారు. కానీ మా బంధువు ఒకరికి దీన్ని వాడితే చెవిలో రీసౌండ్, దురద వచ్చాయి. రెండు రోజులకే మానేశారు. నాకూ ఇలాగే అవుతుందా? వినికిడి యంత్రాన్ని వాడుకోవాలా? వద్దా?
రెడ్డివాణి
సలహా: మీరు తెలిపిన వివరాలను బట్టి మీకు సెన్సోరీ న్యూరల్ డెఫ్‌నెస్ ఉందనిపిస్తోంది. ఇది స్వల్పంగా గలవారికి మాటలు వినిపిస్తాయి గానీ సరిగా అర్థం కావు. ఒక చెవిలో సమస్య ఉన్నవారు ఎలాగోలా నెట్టు కొస్తుంటారు. రెండు చెవుల్లో ఉంటే మాత్రం కష్టం. మాటలు స్పష్టంగా వినిపించక ఇబ్బంది పడతారు. మీకు చిన్నప్పటి నుంచి ఒక చెవిలోనే.. లేదూ ఒక చెవిలో ఎక్కువ, మరో చెవిలో తక్కువగా సమస్య ఉండి ఉండొచ్చు. అందుకే సర్దుకొని రావటం సాధ్యమైంది. ఇటీవల రెండో చెవిలో సమస్య మొదలవ్వటం వల్ల వినికిడి లోపం ఎక్కువై ఉండొచ్చు. మీరు నిపుణులైన ఆడియాలజిస్టుతో వినికిడి పరీక్ష చేయించుకోవటం మంచిది. ప్యూర్‌టోన్ ఆడియోమెట్రీ పరీక్ష ద్వారా ఎలాంటి రకం వినికిడి లోపమో స్పష్టంగా తెలుస్తుంది. ఏ స్థాయి (ఫ్రీక్వెన్సీ) మాటలు వినిపించటం లేదో కూడా బయటపడుతుంది. తీవ్రతను బట్టి చికిత్స సూచిస్తారు. వినికిడి లోపం 30-40 డెసిబెల్స్ ఉంటే సమస్య స్వల్పంగా, 50-60 డెసిబెల్స్ ఉంటే మధ్యస్థంగా, 70-80 డెసిబెల్స్ ఉంటే తీవ్రంగా.. 90 డెసిబెల్స్ కన్నా ఎక్కువుంటే అత్యంత తీవ్రంగా ఉన్నట్టు అర్థం. వినికిడి లోపం 30 డెసిబెల్స్ కన్నా ఎక్కువ గలవారికి వినికిడి సాధనం అవసరమవుతుంది. దీన్ని సరిగా ప్రోగ్రామింగ్ చేయటమూ ముఖ్యమే. ఏ ఫ్రీక్వెన్సీలో ఎంత వినికిడి తక్కువుందో గుర్తించి, వినికిడి పరికరంలో దాన్ని అంతవరకు పెంచాల్సి ఉంటుంది. అప్పుడే మాటలు సరిగా వినిపిస్తాయి. కాబట్టి నైపుణ్యం గల ఆడియాలజిస్టుతో పరీక్షించి, దీన్ని సెట్ చేసుకోవాలి. లేకపోతే ఉపయోగముండదు. వినికిడి యంత్రాన్ని చెవి మార్గంలో సరిగ్గా అమర్చటమూ కీలకమే. లేకపోతే రీసౌండ్ రావచ్చు. యంత్రంతో చెవి మార్గం నిరంతరం మూసుకుపోతే దురద, అసౌకర్యం తలెత్తొచ్చు. అప్పుడప్పుడు డాక్టర్‌ను సంప్రదించి, చెవులను శుభ్రం చేసుకుంటే ఇలాంటి ఇబ్బందులు తప్పించుకోవచ్చు. మీ బంధువుకు జరిగినట్టే మీకూ జరగాలనేమీ లేదు. వినికిడి లోపంతో బాధపడే కన్నా పరికరం వాడుకోవటమే మేలు. కచ్చితమైన వినికిడి పరీక్ష చేయించుకొని, పరికరాన్ని సరిగా సెట్ చేసుకొని, చెవి మార్గంలో సరిగ్గా అమర్చుకుంటే ఎలాంటి ఇబ్బందులూ ఉండవని తెలుసుకోవాలి. వినికిడి లోపం తీవ్రంగా, అత్యంత తీవ్రంగా ఉన్నవారికి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ఉపయోగపడుతుంది.
మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మా ఈమెయిల్ sukhi@eenadu.in కు పంపొచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
KL Rahul: కెప్టెన్సీ అంటే ఇష్టం.. ఇది నాకేం కొత్త కాదు: కేఎల్ రాహుల్
-
IRCTC tour package: ఒక్క రోజులోనే ఆంధ్రా ఊటీ అందాలు చూసొస్తారా?.. IRCTC టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే..!
-
Koppula Harishwar Reddy: ప్రభుత్వ అధికార లాంఛనాలతో హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియలు
-
Chandrababu Arrest : రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు విచారణ ప్రారంభం
-
Kakinada: పామాయిల్ తోటలో విద్యుత్ తీగలు తగిలి.. ముగ్గురి మృతి
-
Justin Trudeau: ‘మేం ముందే ఈ విషయాన్ని భారత్కు చెప్పాం’: ఆగని ట్రూడో వ్యాఖ్యలు