పెదవి మీద రోమాలు..పోయే దారేది?

సమస్య: నాకు పై పెదవి మీద మీసాల మాదిరిగా వెంట్రుకలు మొలుస్తున్నాయి. దాదాపు పదేళ్లుగా దీంతో ఇబ్బంది పడుతున్నాను. ఏంటీ సమస్య? దీన్ని శాశ్వతంగా తొలగించుకునే మార్గమేది?..

Published : 12 Oct 2018 22:07 IST

సమస్య - సలహా 

పెదవి మీద రోమాలు..పోయే దారేది?

 

సమస్య: నాకు పై పెదవి మీద మీసాల మాదిరిగా వెంట్రుకలు మొలుస్తున్నాయి. దాదాపు పదేళ్లుగా దీంతో ఇబ్బంది పడుతున్నాను. ఏంటీ సమస్య? దీన్ని శాశ్వతంగా తొలగించుకునే మార్గమేది?

- రేష్మిక (ఈమెయిల్‌ ద్వారా)

సలహా: మీరు ఎదుర్కొంటున్న సమస్యను ‘హిర్సూటిజమ్‌’ అంటారు. ఇందులో మగవాళ్ల మాదిరిగా ఆడవాళ్లకు పెదవుల పైన, చుబుకం మీద వెంట్రుకలు మొలుస్తుంటాయి. ఇలాంటి అవాంఛిత రోమాలను క్రీములు, ఎలక్ట్రాలసిస్‌, లేజర్‌ వంటి పద్ధతులతో తొలగించుకోవచ్చు. అయితే వీటిల్లో లేజర్‌ ప్రక్రియనే మంచి పద్ధతి. క్రీములతో ఫలితం తాత్కాలికమే. వీటిని రాసుకున్నప్పుడు వెంట్రుకలు పోతాయి గానీ కొంతకాలానికి తిరిగి అంతే దట్టంగా మొలుస్తాయి. కొందరికి క్రీములతో అలర్జీ కూడా రావొచ్చు. తాడు ద్వారా చేసే థ్రెడింగ్‌ పద్ధతిలోనూ, ఎలెక్ట్రాలిసిస్‌ పద్ధతిలోనూ నొప్పి కలుగుతుంది. లేజర్‌ ప్రక్రియలో ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు.

పెదవి మీద రోమాలు..పోయే దారేది? దీర్ఘకాలం ఫలితం కనబడుతుంది. అయితే లేజర్‌ ద్వారా ఒకేసారి మొత్తం వెంట్రుకలను తొలగించటం వీలు కాదు. అవసరమైతే రెండు మూడు సార్లు చేయాల్సి వస్తుంది. క్రమంగా వెంట్రుకల సంఖ్య తగ్గుతూ వస్తుంది. వెంట్రుకలు పూర్తిగా తొలగిపోకపోవచ్చు గానీ కనబడీ కనబడని స్థితికి తీసుకురావొచ్చు. ఇలాంటి అవాంఛిత రోమాల సమస్యకు ప్రధాన కారణం హార్మోన్ల మధ్య వ్యత్యాసం. యుక్తవయసులో హార్మోన్ల ఉద్ధృతి ఎక్కువ. అమ్మాయిల్లో అబ్బాయిల్లో.. ఇద్దరిలోనూ స్త్రీ, పురుష హార్మోన్లు రెండూ ఉంటాయి. కాకపోతే అమ్మాయిల్లో స్త్రీ హార్మోన్లు, అబ్బాయిల్లో పురుష హార్మోన్లు పెద్దమొత్తంలో విడుదలవుతాయి. ఒకవేళ అమ్మాయిల్లో పురుష హార్మోన్ల ఉత్పత్తి ఎక్కువైతే మీసాలు, గడ్డాల మాదిరిగా వెంట్రుకలు మొలుస్తుంటాయి. నెలసరి నిలిచిపోవటం మూలంగానూ హార్మోన్ల వ్యత్యాసాలు తలెత్తొచ్చు. అలాగే పీసీఓడీ, అడ్రినల్‌ గ్రంథుల సమస్యల వంటి వాటిల్లోనూ మీసాలు, గడ్డాలు రావొచ్చు. కాకపోతే ఇలాంటి సమస్యల్లో వెంట్రుకలు కాస్త దట్టంగా కనబడతాయి. అందువల్ల మీరు ఇలాంటి సమస్యలేవైనా ఉన్నాయేమో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఎండోక్రైనాలజిస్ట్‌ను సంప్రతించటం మంచిది. దీంతో కారణాన్ని గుర్తించి, తగు చికిత్స చేయటానికి వీలవుతుంది.

మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన చిరునామా 
సమస్య - సలహా సుఖీభవ ఈనాడు ప్రధాన కార్యాలయం, 
రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512 email:sukhi@eenadu.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు