పొగ అలవాటుతో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ తీవ్రం

సిగరెట్లు, చుట్టలు, బీడీలు కాల్చేవారికి క్యాన్సర్ల ముప్పు ఎక్కువ. విచిత్రంగా పొగతాగే మగవారికి ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం తక్కువని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

Published : 17 May 2022 00:44 IST

సిగరెట్లు, చుట్టలు, బీడీలు కాల్చేవారికి క్యాన్సర్ల ముప్పు ఎక్కువ. విచిత్రంగా పొగతాగే మగవారికి ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం తక్కువని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఇది ప్రోస్టేట్‌ గ్రంథి లోపల తలెత్తే క్యాన్సర్లకే వర్తిస్తున్నట్టు స్వీడన్‌లోని లుండ్‌ యూనివర్సిటీ అధ్యయనం పేర్కొంటోంది. అంతేకాదు, పొగతాగేవారికి ప్రోస్టేట్‌ క్యాన్సర్‌తో మరణించే ముప్పు చాలా ఎక్కువగా ఉంటున్నట్టూ బయటపడింది. జబ్బు నిర్ధరణ అయినప్పుడు కణితి సైజుతో సంబంధం లేకుండా మరణించే ముప్పు అధికంగా ఉంటుండటం గమనార్హం. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ బారినపడ్డవారిలో పొగ తాగనివారితో పోలిస్తే- పొగతాగే వారికి మరణించే ముప్పు 20% ఎక్కువగా ఉంటోంది. అధిక బరువు (శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి 25-30), ఊబకాయం (శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి 30 కన్నా ఎక్కువ) గలవారికి ఈ ముప్పు మరింత ఎక్కువవుతోంది కూడా. పొగతాగే అలవాటు గలవారికి ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ వచ్చాక ఎందుకింత తీవ్రమవుతోందనేది తెలియరాలేదు. అందుకే దీని కారణాన్ని గుర్తించాల్సిన అవసరముందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని