వ్యాయామమూ అవసరమే

అధిక బరువు నియంత్రణ అనగానే అంతా సూచించేది తక్కువ కేలరీలతో కూడిన ఆహారం తినమనే. అయితే అందరికీ ఒకే సూత్రం పనికిరాదని, ఆయా వ్యక్తులను బట్టి బరువు తగ్గించే పద్ధతులు పాటించాలని

Updated : 16 Aug 2022 06:38 IST

అధిక బరువు నియంత్రణ అనగానే అంతా సూచించేది తక్కువ కేలరీలతో కూడిన ఆహారం తినమనే. అయితే అందరికీ ఒకే సూత్రం పనికిరాదని, ఆయా వ్యక్తులను బట్టి బరువు తగ్గించే పద్ధతులు పాటించాలని యూనివర్సిటీ ఆఫ్‌ ఒటావా అధ్యయనం పేర్కొంటోంది. ఆహార పద్ధతులతో బరువు తగ్గని ఊబకాయుల విషయంలో వ్యాయామానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తోంది. వ్యాయామంతో కొవ్వు మోతాదు తగ్గుతుంది. ఎముకలకు అంటుకొని ఉండే కండరాల జీవక్రియా పుంజుకుంటుంది. దీంతో బరువు తగ్గే అవకాశాలూ మెరుగవుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా తిండి తగ్గించినా బరువు తగ్గకపోతే ఆహార నియమాలు సరిగా పాటించటం లేదనే నిందిస్తుంటారు. ఇది ఊబకాయులను మరింత ఆందోళనకు గురిచేస్తుంటుంది. వీరి విషయంలో చికిత్సల తీరును మార్చుకోవాల్సిన అవసరముందని అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. కేలరీలు తగ్గించటమే సరిపోదని, వ్యాయామమూ కీలకమేనని సూచిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని