ఈ జాగ్రత్తలు పాటించండి
‘కొవాగ్జిన్’ టీకాపై భారత్ బయోటెక్ సూచనలు
ఈనాడు, హైదరాబాద్: జ్వరం, అలర్జీలు, రక్తస్రావం.. వంటి ఆరోగ్య సమస్యలుంటే ‘కొవాగ్జిన్’ టీకా తీసుకోవద్దని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. టీకా తీసుకునే వారికి/ టీకా ఇచ్చే వారికి కొన్ని మార్గదర్శకాలతో కూడిన ఒక ‘ఫ్యాక్ట్ షీట్’ను తాజాగా కంపెనీ విడుదల చేసింది. గర్భిణులు, పాలిచ్చే తల్లులపై ఈ టీకా ప్రభావాన్ని ఇంకా పరిశీలించలేదని, కాబట్టి అటువంటి వారు కూడా ప్రస్తుతానికి టీకా తీసుకోకపోవటం మేలని వివరించింది. ‘కొవాగ్జిన్’ టీకా మొదటి-రెండో దశ క్లినికల్ పరీక్షల్లో ఎంతో మెరుగైన ఫలితాలు లభించాయని, యాంటీబాడీలు వృద్ధి చెందడానికి ఈ టీకా వీలు కల్పిస్తోందని స్పష్టమైనట్లు భారత్ బయోటెక్ పేర్కొంది. దీనిపై మూడో దశ క్లినికల్ పరీక్షలు ఇంకా జరుగుతున్నాయని, ఆ పరీక్షల ఫలితాలన్నీ వచ్చాక ‘క్లినికల్ ఎఫికసీ’ (సామర్థ్యం) నిర్ధారణ అవుతుందని వివరించింది. ఇన్-యాక్టివేటెడ్ సార్స్ కోవ్-2 వైరస్‌ను ఉపయోగించి ‘కొవాగ్జిన్’ టీకా తయారు చేసినట్లు తెలియజేసింది. నాలుగు వారాల వ్యవధిలో రెండు డోసులుగా ఈ టీకా తీసుకుంటే ఫలితం ఉంటుందని వెల్లడించింది.
తీవ్ర సైడ్ ఎఫెÆక్టులు ఉండవు
టీకా తీసుకున్న తర్వాత కొన్ని ‘సైడ్ ఎఫెక్టులు’ కనిపించవచ్చని పేర్కొంది. ఇంజెక్షన్ చేసిన చోట నొప్పి, వాపు, దురదతో పాటు తలనొప్పి- జ్వరం రావచ్చని, నీరసంగా ఉండటం, వాంతులు కావటం.. కూడా కనిపిస్తాయని తెలిపింది. కొవాగ్జిన్ టీకావల్ల తీవ్రమైన ‘అలర్జిటిక్ రియాక్షన్’ కనిపించే అవకాశాలు లేవని స్పష్టం చేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Air India Express: గగనతలంలో ఇంజిన్లో మంటలు.. విమానానికి తప్పిన ముప్పు
-
Movies News
K Vishwanath: కె.విశ్వనాథ్ ఖాకీ దుస్తుల వెనుక కథ ఇది!
-
Movies News
K Viswanath: విశ్వనాథ వారి కలం.. అవార్డులు వరించిన ఈ ఐదు చిత్రాలు ఎంతో ప్రత్యేకం..!
-
Politics News
Somu Veerraju: కలసి వస్తే జనసేనతో.. లేకుంటే ఒంటరిగానే పోటీ: సోము వీర్రాజు
-
World News
China: అమెరికా ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టాలనుకుంటోంది
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు