Published : 19 Jan 2021 00:54 IST

గుండెకు ‘కృత్రిమ’ సాయం

చాలారకాల గుండెజబ్బుల్లో తరచూ కనిపించే లక్షణం గుండెకు తగినంత రక్తం అందకపోవటం. కానీ దీన్ని గుర్తించాలంటే రక్తనాళంలోకి గొట్టాన్ని పంపించి (యాంజియోగ్రామ్‌) పరీక్షించాల్సి ఉంటుంది. దీనికి సమయమూ ఎక్కువ తీసుకుంటుంది. మరి కోత అవసరం లేకుండా గుర్తించగలిగితే? ఇందుకు కృత్రిమ మేధ ప్రత్యామ్నాయ పద్ధతిగా తోడ్పడగలదని తాజాగా బయటపడింది. గుండె స్కాన్‌ పరీక్షలను విశ్లేషించి.. రక్త సరఫరా తగ్గినప్పుడు కనిపించే లక్షణాలను గుర్తించేలా పరిశోధకులు కంప్యూటర్లకు శిక్షణ ఇచ్చారు. ఇవి చాలా కచ్చితంగా సమస్యను గుర్తించటం గమనార్హం. ఇలా గుండెపోటు, పక్షవాతం ముప్పులనూ అంచనా వేయగలిగాయి. గుండెకు తగినంత రక్తం అందటం లేదని ముందుగానే గుర్తిస్తే తగు చికిత్స చేసే అవకాశముంది. ఇందుకు తేలికైన, కోత అవసరం లేని కృత్రిమ మేధ పరిజ్ఞానం మున్ముందు బాగా ఉపయోగపడగలదని.. గుండెపోటు, పక్షవాతం నివారణకు తోడ్పడగలదని భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు