పొగ మానటానికి సంయుక్త చికిత్స మేలు

పొగతాగే అలవాటు మాన్పించటానికి ఒకట్రెండు చికిత్సలు కలిపి ఇవ్వటం మేలని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌ అధ్యయనం సూచిస్తోంది. ముఖ్యంగా వారెనెక్లైన్‌, నికొటిన్‌ రిప్లేస్‌మెంట్‌ థెరపీ (ఎన్‌ఆర్‌టీ)....

Updated : 13 Sep 2022 15:28 IST

పొగతాగే అలవాటు మాన్పించటానికి ఒకట్రెండు చికిత్సలు కలిపి ఇవ్వటం మేలని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌ అధ్యయనం సూచిస్తోంది. ముఖ్యంగా వారెనెక్లైన్‌, నికొటిన్‌ రిప్లేస్‌మెంట్‌ థెరపీ (ఎన్‌ఆర్‌టీ) కలిపి ఇస్తే మంచి ఫలితం కనిపిస్తున్నట్టు తేలింది. పొగ అలవాటు మాన్పించే చికిత్సలో వారెనెక్లైన్‌, బుప్రొపియాన్‌, ఎన్‌ఆర్‌టీని ప్రధానంగా వాడుతుంటారు. ఇ-సిగరెట్లు కూడా కొంతవరకు తోడ్పడతాయి. కానీ ప్రస్తుతం వైద్యపరంగా వాడుకోవటానికి వీటికి అనుమతి లేదు. ప్రపంచవ్యాప్తంగా అకాల మరణాలకు, జబ్బులకు పొగ అలవాటు పెద్ద కారణంగా నిలుస్తున్న నేపథ్యంలో తాజా అధ్యయనం నిర్వహించారు. వారెనెక్లైన్‌, బుప్రొపియాన్‌, ఎన్‌ఆర్‌టీ, ఇ-సిగరెట్ల లాభనష్టాలను బేరీజు వేశారు. వారెనెక్లైన్‌, ఎన్‌ఆర్‌టీతో కూడిన సంయుక్త చికిత్స బాగా సమర్థంగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. బుప్రొపియాన్‌ కూడా సమర్థంగా పనిచేస్తున్నట్టు తేలినప్పటికీ కొన్ని తీవ్ర దుష్ప్రభావాలు పొడసూపుతున్నాయి. ఇ-సిగరెట్లు కొంతవరకు మేలు చేస్తున్నా ఇవి ఎంతవరకు సురక్షితమనే దాని మీద ఇంకొంత పరిశోధన చేయాల్సి ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని