జ్ఞాపక పీచు!
వృద్ధాప్యంలో మతిమరుపు (డిమెన్షియా) బారినపడకూడదని అనుకుంటున్నారా? అయితే ఇప్పట్నుంచే కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవటం మొదలెట్టండి. వీటి ద్వారా లభించే పీచుతో డిమెన్షియా ముప్పు తగ్గుతున్నట్టు బయటపడింది మరి. నిజానికి ఆహారం ద్వారా లభించే పీచు అనగానే ముందుగా పేగుల ఆరోగ్యమే గుర్తుకొస్తుంది. ఇది మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది మరి. ఇప్పుడిది నాడీ వ్యవస్థ మీదా గణనీయమైన ప్రభావాన్నే చూపుతున్నట్టు తేలింది. పేగుల్లోని బ్యాక్టీరియా జీర్ణకోశ వ్యవస్థ పనితీరులోనే కాదు, విషయగ్రహణ సామర్థ్యం పైనా ప్రభావం చూపుతున్నట్టు ఇప్పటికే కొన్ని ప్రయోగాల్లో వెల్లడైంది. కానీ పీచు వాడకానికీ తీవ్ర మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియాకూ మధ్య సంబంధం గురించే పెద్దగా తెలియదు. అందుకే పరిశోధకులు జపాన్‌లోని కొన్ని సమూహాలపై గతంలో నిర్వహించిన అధ్యయన ఫలితాలపై దృష్టి సారించారు. పీచు.. ముఖ్యంగా నీటిలో కరిగే పీచు ఎక్కువగా తీసుకున్నవారికి డిమెన్షియా ముప్పు తగ్గినట్టు గుర్తించారు. అయితే ఇదెలా సాధ్యమవుతోందనేది బయటపడలేదు. మెదడుకు, పేగులకు మధ్య కొనసాగే చర్యలు దీనికి కారణం కావొచ్చని భావిస్తున్నారు. నీటిలో కరిగే పీచు పేగుల్లో బ్యాక్టీరియా సమతులంగా ఉండేలా చూస్తుంది. ఇలా ఇది డిమెన్షియా తలెత్తటంలో పాలు పంచుకునే నాడుల వాపుప్రక్రియను అదుపులో ఉంచుతుండొచ్చని అనుకుంటున్నారు. డిమెన్షియా ముప్పు కారకాలైన అధిక బరువు, రక్తపోటు, కొవ్వులు, గ్లూకోజు మోతాదుల వంటివి తగ్గటానికీ పీచు తోడ్పడటమూ మేలు చేస్తుండొచ్చని ఊహిస్తున్నారు. ఏదేమైనా ఆహారంలో రంగురంగుల కూరగాయలు, పండ్లను చేర్చుకోవటం శారీరక ఆరోగ్యానికే కాదు.. నాడులకూ మేలు చేస్తున్నట్టు బయటపడటం విశేషం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
SJM: సంపన్నులకు పన్ను రాయితీ కాదు.. వారి పాస్‌పోర్టులు రద్దు చేయాలి : ఎస్జేఎం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Nellore: కోటంరెడ్డిని తప్పించి.. నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డికి బాధ్యతలు
-
Movies News
Chiranjeevi: ఉదారత చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఏకంగా రూ.5 లక్షలు ఆర్థికసాయం
-
General News
ED: మద్యం కుంభకోణం మనీలాండరింగ్ కేసు.. ఈడీ ఛార్జిషీట్లో కేజ్రీవాల్, కవిత పేర్లు
-
Crime News
కారు ప్రమాదం.. కళ్లముందే నిండు గర్భిణీ, భర్త సజీవదహనం