ముఖం ఉబ్బితే..?

కొన్నిసార్లు ఉదయం లేవగానే ముఖం ఉబ్బినట్టుగా కనిపిస్తుంటుంది. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బులతో బాధపడేవారు వేసుకునే మందులతో కొందరికి నిద్రలేవగానే ముఖం ఉబ్బొచ్చు.

Updated : 22 Mar 2022 05:47 IST

కొన్నిసార్లు ఉదయం లేవగానే ముఖం ఉబ్బినట్టుగా కనిపిస్తుంటుంది. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బులతో బాధపడేవారు వేసుకునే మందులతో కొందరికి నిద్రలేవగానే ముఖం ఉబ్బొచ్చు. ఇతరత్రా సమస్యల కోసం స్టిరాయిడ్లు వాడేవారిలోనూ ఇలా కనిపిస్తుంటుంది. హైపోథైరాయిడిజమ్‌, కుషింగ్‌ సిండ్రోమ్‌ వంటి  జబ్బులూ దీనికి కారణం కావచ్చు. ముక్కు చుట్టుపక్కల గాలిగదుల్లోని గోడల వాపు (సైనసైటిస్‌) గలవారిలోనూ ముఖం ఉబ్బినట్టు కనిపించొచ్చు. కొన్నిసార్లు అలర్జీలు, కీటకాలు కుట్టటం వంటివీ తాత్కాలికంగా దీనికి దోహదం చేయొచ్చు. కాబట్టి ఉదయం నిద్రలేవగానే ముఖం ఉబ్బినట్టు అనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించి, తగు కారణాన్ని గుర్తించి జాగ్రత్త పడటం మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు