ఫంగస్‌తో జాగ్రత్త!

ప్రపంచ ఆరోగ్యసంస్థ తొలిసారిగా 19 రకాల ఫంగస్‌ జాబితాను విడుదల చేసింది. ఇవి ప్రజారోగ్యానికి పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయని పేర్కొంది. రోజురోజుకీ సూక్ష్మక్రిములు చికిత్సలకు లొంగని విధంగా మొండిగా తయారవుతున్నాయి.

Published : 01 Nov 2022 00:10 IST

ప్రపంచ ఆరోగ్యసంస్థ తొలిసారిగా 19 రకాల ఫంగస్‌ జాబితాను విడుదల చేసింది. ఇవి ప్రజారోగ్యానికి పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయని పేర్కొంది. రోజురోజుకీ సూక్ష్మక్రిములు చికిత్సలకు లొంగని విధంగా మొండిగా తయారవుతున్నాయి. ప్రస్తుతం నాలుగు రకాల యాంటీఫంగల్‌ మందులే అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని ప్రయోగ పరీక్షల దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫంగస్‌లపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందనే విషయాన్ని నొక్కిచెప్పటానికి జాబితా రూపొందించింది. నాలుగింటిని అతి కీలకమైన ఫంగస్‌గా వర్గీకరించింది. క్యాన్సర్‌, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌, దీర్ఘకాల శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల పైభాగాలకు పరిమితమైన క్షయ వంటి జబ్బులు గలవారికి.. అవయవ మార్పిడి చేయించుకున్నవారికి వీటి ముప్పు మరింత ఎక్కువగా ఉంటోందని హెచ్చరించింది.

* క్రిప్టోకాకస్‌ నియోఫోర్‌మాన్స్‌: ఇది శ్వాస ద్వారా శరీరంలోకి చేరుకుంటుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది.

* క్యాండిడా ఆరిస్‌: ఆసుపత్రుల్లో అత్యవసర విభాగాల్లో బాగా వృద్ధి చెందింది. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో శ్వాసమార్గంలోకి వేసిన గొట్టాల్లో తిష్ఠ వేసుకొంది.

* ఆస్పెర్‌గిలస్‌ ఫ్యుమిగేటెస్‌: రోజూ ఇది చాలామందిలో శ్వాస ద్వారా లోనికి వెళ్తూనే ఉంటుంది. కానీ ఎలాంటి జబ్బు కలగజేయదు. కానీ ఊపిరితిత్తుల జబ్బులు గలవారికి, రోగనిరోధకశక్తి క్షీణించినవారికి మాత్రం ప్రమాదకరంగా మారుతుంది.

* క్యాండిడా ఆల్బికాన్స్‌: ఇదొక ఈస్ట్‌. సాధారణంగా నోరు, గొంతులో వచ్చే థ్రష్‌, జననాంగ ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్ల వంటి వాటికి కారణమవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని