విరేచనాలకు అరటికాయ

అవును.. మంచి ఆహారం మందుగానూ పనిచేస్తుంది. ఇది జబ్బులను పూర్తిగా నయం చేయలేకపోవచ్చు గానీ కొన్ని పదార్థాలు లక్షణాల తీవ్రత తగ్గటానికి తోడ్పడే మాట నిజం.

Published : 22 Nov 2022 00:06 IST

వును.. మంచి ఆహారం మందుగానూ పనిచేస్తుంది. ఇది జబ్బులను పూర్తిగా నయం చేయలేకపోవచ్చు గానీ కొన్ని పదార్థాలు లక్షణాల తీవ్రత తగ్గటానికి తోడ్పడే మాట నిజం. శరీరానికి కొత్త శక్తిని కల్పించి త్వరగా కోలుకునేలా చేస్తాయి. ఉదాహరణకు- అరటికాయనే తీసుకోండి. విరేచనాలు తగ్గటానికివి బాగా తోడ్పడతాయి. వీటిల్లో కఠినమైన పిండి పదార్థముంటుంది. చిన్నపేగులు దీన్ని త్వరగా గ్రహించుకోలేవు. ఇది మంచి బ్యాక్టీరియాకు ఆహారంగానూ ఉపయోగపడుతుంది. చెడు బ్యాక్టీరియాను బయటకు పంపిస్తుంది. అరటికాయల్లో పొటాషియం వంటి ఎలెక్ట్రోలైట్లు దండిగా ఉంటాయి. విరేచనాలతో కోల్పోయిన ఎలెక్ట్రోలైట్లు భర్తీ కావటానికివి తోడ్పడతాయి. ఇక తేనె గురించి చెప్పుకోవాలంటే చాలానే ఉంది. అనాదిగా ఔషధంగా వాడుతూనే వస్తున్నాం. ఇది వాపును తగ్గిస్తుంది. నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. హానికర బ్యాక్టీరియాను చంపుతుంది. వైరల్‌ ఇన్‌ఫెక్షన్లతో పోరాడే యాంటీబాడీలూ తేనెలో పుష్కలంగా ఉంటాయి. నియాసిన్‌, విటమిన్‌ సి వంటి విటమిన్లు.. క్యాల్షియం, ఐరన్‌ వంటి ఖనిజాలు కూడా లభిస్తాయి. ఇవన్నీ శక్తిని పెంచేవే. గోరువెచ్చటి నీటిలో రెండు చెంచాల తేనె కలిపి తాగితే దగ్గు తగ్గుముఖం పడుతుంది కూడా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని