మధుమేహానికి ముందే!

మధుమేహం పెద్ద సమస్య. మనదేశంలో సుమారు 7.5 కోట్ల మంది దీంతో బాధ పడుతున్నారని అంచనా. దీని చికిత్స కోసం ప్రతి సంవత్సరం ఒకొకరు దాదాపు 9వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు.

Published : 24 Jan 2023 00:07 IST

ధుమేహం పెద్ద సమస్య. మనదేశంలో సుమారు 7.5 కోట్ల మంది దీంతో బాధ పడుతున్నారని అంచనా. దీని చికిత్స కోసం ప్రతి సంవత్సరం ఒకొకరు దాదాపు 9వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సమస్య తీవ్రమై.. రక్తనాళాలు, గుండె, కిడ్నీల వంటి కీలక అవయవాలు విఫలమై ఏటా 6.5 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. అధిక బరువు (శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి 23 కన్నా ఎక్కువ).. వయసు (నలబై ఏళ్లు దాటినవారికి).. సన్నిహిత కుటుంబ సభ్యుల్లో మధుమేహం ఉండటం.. వ్యాయామం, శారీరక శ్రమ అంతగా చేయకపోవటం.. అధిక రక్తపోటు.. రక్తంలో కొవ్వు పదార్థం (ట్రైగ్లిజరైడ్లు) ఎక్కువగా ఉండటం.. మహిళల్లో గర్భధారణ సమయంలో మధుమేహం రావటం.. తేలికగా జీర్ణమయ్యే పిండి పదార్థాలు ఎక్కువగా తినటం.. మానసిక ఒత్తిడి వంటివి ముప్పు పెరిగేలా చేస్తాయి. వయసు, కుటుంబ చరిత్ర మన చేతుల్లో లేకపోవచ్చు గానీ ఆహారం, శారీరక శ్రమ వంటి వాటి విషయంలో ముందు నుంచే జాగ్రత్తపడితే మధుమేహాన్ని చాలావరకు నివారించుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని