కాలుష్యానికి ఆవిరి మంత్రం!
పల్లెల్లో నివసించేవాళ్లు ఎక్కువ కాలం జీవిస్తారని, క్యాన్సర్లు వచ్చే అవకాశం తక్కువని భావిస్తుంటారు. ఇందులో నిజం లేకపోలేదు. దీనికి కారణం చాలావరకు స్వచ్ఛమైన గాలే. పట్టణాల్లో కాలుష్యం ఎక్కువ. నగరాలు, మహా నగరాల్లో నివసించిన వారి ఊపిరితిత్తుల్లోని లింఫు గ్రంథుల్లో నల్లటి కాలుష్య కారకాలు ఉంటున్నట్టు శవ పరీక్షల్లో తేలింది. ఇవి రోగనిరోధక కణాలు, హానికారక సూక్ష్మక్రిములను మింగే మాక్రోఫేజస్ పనితీరును తగ్గిస్తాయి. దీంతో తరచూ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తలెత్తటమే కాదు.. క్యాన్సర్ ముప్పూ పెరుగుతుంది. కాలుష్యాన్ని తగ్గించగలిగితే దీంతో ముడిపడిన జబ్బులూ తగ్గుముఖం పడతాయి. అలాగే క్రమం తప్పకుండా ముఖానికి ఆవిరి పట్టటమూ మంచిదే. ఇది శ్వాసనాళం నుంచి కాలుష్య కారకాలు తొలగిపోయేలా చేస్తుంది. ఫలితంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తలెత్తే అవకాశమూ తగ్గుతుంది. కాబట్టి గాలి కాలుష్యం అధికంగా ఉండే చోట్ల నివసించే వారు రోజుకు ఒకట్రెండు సార్లు ముఖానికి ఆవిరి పట్టుకోవటం ఎంతైనా మంచిది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Kangana Ranaut: నా వాట్సాప్ డేటా లీక్ చేస్తున్నారు.. స్టార్ కపుల్పై కంగనా ఆరోపణలు
-
World News
EarthQuake: తుర్కియే, సిరియాలో భారీ భూకంపం.. 90మందికి పైగా మృతి
-
Movies News
Telugu Movies: ఈ వారం ఇటు థియేటర్ అటు ఓటీటీ సందడే సందడి
-
World News
US Visa: విదేశాల్లో ఉన్న భారతీయులకు అక్కడే అమెరికా వీసా
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
Telangana News: గూగులమ్మకు యూట్యూబ్ కళాకారుల బోనాలు