నులి పురుగులకు కొబ్బరి మందు!

నులి పురుగులు తగ్గటానికి బోలెడన్ని చిట్కాలు ఉన్నప్పటికీ వీటిల్లో అన్నింటికన్నా సమర్థమైంది కొబ్బరి. ఇది అతి ప్రాచీనమైన చికిత్స. అన్నిరకాల నులి పురుగులు తగ్గటానికి తోడ్పడుతుంది.

Published : 31 Jan 2023 00:07 IST

నులి పురుగులు తగ్గటానికి బోలెడన్ని చిట్కాలు ఉన్నప్పటికీ వీటిల్లో అన్నింటికన్నా సమర్థమైంది కొబ్బరి. ఇది అతి ప్రాచీనమైన చికిత్స. అన్నిరకాల నులి పురుగులు తగ్గటానికి తోడ్పడుతుంది. అల్పాహారం తినే సమయంలో ఒక చెంచాడు తాజా కొబ్బరి కోరును తినాలి. మూడు గంటల తర్వాత కొద్దిగా ఆముదం తాగాలి. నులి పురుగులు తొలగిపోయేంతవరకు ఇలాగే చేయాలి. పురాతన కాలం నుంచి వాడుతున్న మరో దినుసు వెల్లుల్లి. తాజా వెల్లుల్లి, వెల్లుల్లి నూనె రెండూ నులి పురుగులు తగ్గటానికి తోడ్పడేవే. అతి పురాతనమైన పద్ధతి షూలో ఒకట్రెండు తాజా వెల్లులి రెబ్బలను పెట్టుకోవటం. నడుస్తున్నప్పుడు ఇవి నలిగిపోయి, నులి పురుగులను చంపే నూనె బయటకు వస్తుంది. ఇది చర్మం ద్వారా రక్తంలోకి చేరుకొని.. అక్కడ్నుంచి పేగుల్లోకి వెళ్తుంది. నులి పురుగులతో బాధపడే పిల్లలకు రోజూ ఒక కప్పు తురిమిన క్యారెట్‌ను ఇచ్చినా మేలే. క్యారెట్‌ అన్నిరకాల పరాన్నజీవులను అరికడుతుంది. ముఖ్యంగా థ్రెడ్‌ పురుగుల నిర్మూలనకు బాగా ఉపయోగపడుతుంది. దానిమ్మ చెట్టు కాండం, వేరు బెరడులూ నులి పురుగులు తగ్గటానికి తోడ్పడతాయి. వేరు బెరడు అయితే ఇంకా ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఈ బెరడును నీటిలో మరిగించి కషాయం చేసుకోవాలి. చల్లారిన తర్వాత తాగాలి. పెద్దవాళ్లు 90 మి.లీ. నుంచి 180 మి.లీ. మోతాదులో తీసుకోవచ్చు. గంటకోసారి చొప్పున మూడు సార్లు తాగాలి. చివరి మోతాదు తాగాక విరేచనం వచ్చే మందు వేసుకోవాలి. పిల్లలకైతే ఈ కషాయాన్ని 30-60 మి.లీ. మోతాదులో ఇవ్వచ్చు. బద్ద పురుగులు తగ్గటానికిది బాగా ఉపయోగపడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని