యాంటీబయాటిక్స్‌తో పేగుపూత!

తరచూ యాంటీబయాటిక్స్‌ వాడుతున్నారా? అయితే కాస్త జాగ్రత్త. నలబై ఏళ్లు పైబడినవారు తరచూ యాంటీబయాటిక్స్‌ వాడుతుంటే పేగుపూత (ఇన్‌ఫ్లమేటర్‌ బవల్‌ డిసీజ్‌) ముప్పు పెరుగుతున్నట్టు బయటపడింది.

Published : 09 May 2023 00:42 IST

తరచూ యాంటీబయాటిక్స్‌ వాడుతున్నారా? అయితే కాస్త జాగ్రత్త. నలబై ఏళ్లు పైబడినవారు తరచూ యాంటీబయాటిక్స్‌ వాడుతుంటే పేగుపూత (ఇన్‌ఫ్లమేటర్‌ బవల్‌ డిసీజ్‌) ముప్పు పెరుగుతున్నట్టు బయటపడింది. యాంటీబయాటిక్స్‌ వాడిన ఒకట్రెండు ఏళ్ల తర్వాత.. ముఖ్యంగా పేగుల ఇన్‌ఫెక్షన్‌ తగ్గటానికి వేసుకునే మందులతో ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉంటున్నట్టు తేలింది. పేరుకు ఐబీడీ ఒకటే అయినా ఇందులో క్రాన్స్‌ డిసీజ్‌, అల్సరేటివ్‌ కొలైటిస్‌ సమస్యలు తలెత్తు తుంటాయి. చిన్నవయసులో ఐబీడీ రావటానికి యాంటీబయాటిక్స్‌ వాడకం ఒక ముప్పు కారకం. అయితే పెద్ద వయసులోనూ దీనికి సంబంధం ఉంటుందనేది కచ్చితంగా తెలియదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే డచ్‌ పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. యాంటీబయాటిక్స్‌ వాడనివారితో పోలిస్తే వీటిని వాడినవారికి ఐబీడీ ముప్పు పెరుగుతున్నట్టు.. పెద్ద వయసువారికి ఇది మరింత ఎక్కువగా ఉంటున్నట్టు తేలింది. 10-40 ఏళ్ల వారికి ఐబడీ వచ్చే అవకాశం 28% ఉండగా.. 40-60 ఏళ్లవారికి 48% వరకు పెరుగుతుండటం విశేషం. అల్సరేటివ్‌ కొలైటిస్‌ కన్నా క్రాన్స్‌ డిసీజ్‌ ముప్పు ఇంకాస్త ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని