కండరాలకు ఆకుకూర బలం
కండరాలు బలంగా ఉండాలని కోరుకుంటున్నారా? కింద పడిపోయే ముప్పు తగ్గించుకోవాలని భావిస్తున్నారా? అయితే రోజూ పాలకూర వంటి ఆకుకూరలు తిని చూడండి. ఇవి కండరాలు బలోపేతం కావటానికి,
కండరాలు బలంగా ఉండాలని కోరుకుంటున్నారా? కింద పడిపోయే ముప్పు తగ్గించుకోవాలని భావిస్తున్నారా? అయితే రోజూ పాలకూర వంటి ఆకుకూరలు తిని చూడండి. ఇవి కండరాలు బలోపేతం కావటానికి, ఫలితంగా వృద్ధాప్యంలో కింద పడిపోయే ముప్పు తగ్గటానికి తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇదంతా ఆకుకూరల్లోని నైట్రేట్ల గొప్పతనం. రోజుకు ఒక కప్పు ఆకుకూరలు తిన్నా కండరాల సామర్థ్యం, పనితీరు మెరుగవుతుంది. ప్రతి రోజూ 12 ఏళ్ల పాటు ఆకుకూరలు తిన్నవారిలో కాళ్ల బలం 11%, నడక వేగం 4% ఎక్కువగా ఉంటున్నట్టు ఆస్ట్రేలియా పరిశోధకుల అధ్యయనం పేర్కొంటోంది. వ్యాయామంతో సంబంధం లేకుండానే ఈ ప్రయోజనాలు కనిపిస్తుండటం విశేషం. అలాగని వ్యాయామం అవసరం లేదనుకోవద్దు. బరువులు ఎత్తటం వంటి కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలకు ఆకుకూరలు తినటమూ తోడైతే మరింత ఎక్కువ ఫలితం కనిపిస్తుంది. వయసు మీద పడుతున్నకొద్దీ ఆహారం మీద శ్రద్ధ ఇంకాస్త ముఖ్యం. కాళ్లు బలంగా ఉంటే కింద పడిపోవటం, ఎముకలు విరగటం వంటి ముప్పులు తగ్గుతాయి. ఆకుకూరలు మొత్తంగానే ఆరోగ్యానికీ.. ప్రధానంగా గుండెకూ ఎంతో మేలు చేస్తాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్‌లో లులు మాల్
-
‘నా పెద్ద కొడుకు’ అరెస్టుతో ఆకలి, నిద్ర ఉండడం లేదు
-
Leander Paes: టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు అరుదైన గుర్తింపు
-
Babar Azam: టాప్-4 చిన్న విషయం.. ప్రపంచకప్ గెలవడమే మా లక్ష్యం : బాబర్ అజామ్
-
Guntur Kaaram: రాజమౌళి చిత్రాల స్థాయిలో ‘గుంటూరు కారం’.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా: నిర్మాత నాగవంశీ
-
JP Nadda : జేపీ నడ్డా పూజలు చేస్తున్న గణేశ్ మండపంలో అగ్నిప్రమాదం