చర్మం నిగనిగకు ఉసిరి

చలికాలంలో చర్మం పొడిబారటం మామూలే. మరి దీన్ని నివారించుకునేదెలా? చర్మం నిగనిగలాడేలా చూసుకోవాలంటే ఎలా? ఇందుకు ఉసిరి కాయల రసం బాగా ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని బిగుతుగా పట్టి ఉంచే కొలాజెన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.

Published : 14 Dec 2021 01:04 IST

చలికాలంలో చర్మం పొడిబారటం మామూలే. మరి దీన్ని నివారించుకునేదెలా? చర్మం నిగనిగలాడేలా చూసుకోవాలంటే ఎలా? ఇందుకు ఉసిరి కాయల రసం బాగా ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని బిగుతుగా పట్టి ఉంచే కొలాజెన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీంతో చర్మం ముడతలు పడటం తగ్గుతుంది. అంతేకాదు.. ఉసిరి నల్ల మచ్చలనూ, చర్మం మీద నలుపునూ తొలగిస్తుంది. సహజ విషతుల్య నివారిణిగా పనిచేస్తుంది కూడా. మొటిమలను ప్రేరేపించే హార్మోన్లు సమతులంగా ఉండటానికీ దోహదం చేస్తుంది. రోజూ ఉదయాన్నే నాలుగైదు ఉసిరి కాయల రసాన్ని తీసుకొని.. అందులో కాస్త తేనె, పసుపు కలిపి తాగొచ్చు. తాజా ఉసిరికాయలు దొరక్కపోతే ఉసిరి చూర్ణమైనా తీసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని