ప్రోస్టేట్‌కు శాకాహార రక్ష

శాకాహారం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఇది ప్రోస్టేట్‌ క్యాన్సర్‌, స్తంభన లోపం నుంచీ కాపాడుతున్నట్టు మూడు తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినే

Updated : 28 Dec 2021 05:22 IST

శాకాహారం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఇది ప్రోస్టేట్‌ క్యాన్సర్‌, స్తంభన లోపం నుంచీ కాపాడుతున్నట్టు మూడు తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినే మగవారిలో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ను సూచించే ప్రోస్టేట్‌-స్పెసిఫిక్‌ యాంటీజెన్‌ (పీఎస్‌)) మోతాదులు తక్కువగా ఉంటున్నట్టు మొదటి అధ్యయనం పేర్కొంటోంది. వీరికి అంగ స్తంభన లోపం ముప్పూ తగ్గుతున్నట్టు రెండో అధ్యయనం చెబుతోంది. శాకాహారం తినేవారికి ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పు పెరుగుతున్నట్టు, ఒకవేళ క్యాన్సర్‌ తలెత్తినా తీవ్రమయ్యే అవకాశం తక్కువగా ఉంటున్నట్టు మూడో అధ్యయనం వివరిస్తోంది. కారణమేంటన్నది తెలియరాలేదు గానీ శాకాహారంతో ఒనగూరే విస్తృత ప్రయోజనాలే దీనికీ వర్తిస్తున్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాబట్టి పండ్లు, కూరగాయలు వీలైనంత ఎక్కువగా తినటం మంచిది. వీటిల్లోని వృక్ష రసాయనాలు క్యాన్సర్‌ నివారకాలుగానూ పనిచేస్తాయి. బరువూ అదుపులో ఉంటుంది. ఇవన్నీ క్యాన్సర్‌ బారినపడకుండా చూసేవే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని