వ్యవాహారం!

నమ్మినా నమ్మకపోయినా ఆహారం మన వ్యవహార ధోరణినీ ప్రభావితం చేస్తుంది! సుమారు 30-40 పోషకాలు భావోద్వేగ స్థితిని నియంత్రించటంలో పాలు పంచుకుంటాయి. ఇవి కొద్దిగా లోపించినా జీవరసాయనాలు, మెదడు ....

Published : 01 Feb 2022 00:37 IST

మ్మినా నమ్మకపోయినా ఆహారం మన వ్యవహార ధోరణినీ ప్రభావితం చేస్తుంది! సుమారు 30-40 పోషకాలు భావోద్వేగ స్థితిని నియంత్రించటంలో పాలు పంచుకుంటాయి. ఇవి కొద్దిగా లోపించినా జీవరసాయనాలు, మెదడు పనితీరు మీద ప్రభావం చూపుతాయి. చిరాకు, నిస్సత్తువ, నిరాశ వంటి వాటికి దారితీస్తాయి. ఉదాహరణకు- ట్రిప్టోఫాన్‌నే చూడండి. మన మెదడు సెరటోనిన్‌ అనే ముఖ్యమైన నాడీ సమాచార వాహకాన్ని తయారు చేసుకోవటానికిది అత్యంత అవసరం. మనం పిండి పదార్థాలను పెద్దమొత్తంలో తింటే రక్తంలోంచి మెదడు దీన్ని చాలా వేగంగా గ్రహిస్తుంది. మెదడు కణాల్లో సెరటోనిన్‌ మోతాదులు మరీ ఎక్కువైతే నిద్రమత్తు ఆవహిస్తుంది. అలాగని బాధపడాల్సిన పనిలేదు. పండ్లు, కూరగాయల వంటి వివిధ రకాలనూ ఆహారంలో భాగంగా చేసుకుంటే అన్నిరకాల అత్యవసర పోషకాలు లభిస్తాయి. మెదడూ హుషారుగా పనిచేస్తుంది. అంతేకాదు.. వ్యాధికారకాలతో పోరాడటానికి తెల్లరక్తకణాలకు మెదడు నుంచి నేరుగా సందేశాలు అందుతాయని పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఈ సందేశాల తీరుతెన్నులు మన వ్యవహార ధోరణి మీదా ఆధారపడి ఉండటం విశేషం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని