ఆరోగ్య మధురం!

రోగనిరోధకశక్తి బలోపేతం కావటానికి తేనె బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విశృంఖల కణాలను, హానికారక బ్యాక్టీరియాను అడ్డుకునే గుణాలు దండిగా ఉంటాయి. తేనెను శుద్ధి చేసినప్పుడు, వెలుగు తగిలినప్పుడు దీనిలోని పుప్పొడి దెబ్బతింటుంది.

Published : 01 Mar 2022 00:33 IST

రోగనిరోధకశక్తి బలోపేతం కావటానికి తేనె బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విశృంఖల కణాలను, హానికారక బ్యాక్టీరియాను అడ్డుకునే గుణాలు దండిగా ఉంటాయి. తేనెను శుద్ధి చేసినప్పుడు, వెలుగు తగిలినప్పుడు దీనిలోని పుప్పొడి దెబ్బతింటుంది. ఎక్కువ పోషకాలు ఉండేది ఇందులోనే. అందువల్ల ముడి తేనె అయితే మేలు. ఇందులో క్యాల్షియం, ఐరన్‌, సోడియం, ఫాస్ఫరస్‌, సల్ఫర్‌, పొటాషియం వంటి ఖనిజ లవణాలతో పాటు విటమిన్‌ సి, విటమిన్‌ బి వంటి విటమిన్లు, ప్రొటీన్లు కూడా ఉంటాయి. ముదురు రంగు తేనెలో యాంటీఆక్సిడెంట్లు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో చెంచాడు తేనె, సగం చెక్క నిమ్మరసం కలిసి పరగడుపున తాగితే మలబద్ధకం, ఛాతీ మంట తగ్గుతాయి. ఊబకాయం తగ్గటానికి ఉపవాసం చేసేవారు తేనె, నిమ్మరసం కలిపిన నీళ్లు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. మద్యం తాగిన మర్నాడు తలెత్తే తలనొప్పి వంటి సమస్యలకూ తేనె కళ్లెం వేస్తుంది. ఇందులోని ఫ్రక్టోజ్‌ అనే సహజ చక్కెర కాలేయం మద్యాన్ని త్వరగా విడగొట్టేలా చేస్తుంది. హాయి భావన కలిగిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని