ఛాతీమంటకు సహజ ఉపశమనం

కొందరికి తరచూ ఛాతీలో మంట వేధిస్తుంటుంది. ఈసీజీ వంటి పరీక్షలు చేసినా గుండె మామూలుగానే ఉంటుంది. ఎలాంటి సమస్య ఉండదు. అయినా నొప్పి, మంట వస్తూనే ఉంటాయి. దీనికి కారణం జీర్ణాశయంలోని రసాలు గొంతులోకి ఎగదన్నుకు రావటం.

Updated : 22 Mar 2022 05:45 IST

కొందరికి తరచూ ఛాతీలో మంట వేధిస్తుంటుంది. ఈసీజీ వంటి పరీక్షలు చేసినా గుండె మామూలుగానే ఉంటుంది. ఎలాంటి సమస్య ఉండదు. అయినా నొప్పి, మంట వస్తూనే ఉంటాయి. దీనికి కారణం జీర్ణాశయంలోని రసాలు గొంతులోకి ఎగదన్నుకు రావటం. ఇలాంటివారు రోజూ పరగడుపున రెండు చెంచాల పెరుగు తిని చూడండి. ఇది ఛాతీలో మంట తగ్గటానికి తోడ్పడుతుంది. అలాగే రోజుకు కనీసం 3 లీటర్ల నీళ్లు తాగాలి. భోజనం చేసిన వెంటనే పడుకోవద్దు. కనీసం గంట సేపైనా ఆగాలి. కొన్నిరకాల ఆహార పదార్థాలూ ఛాతీలో మంట, నొప్పిని ప్రేరేపించొచ్చు. మరీ ఎక్కువగా కారం, మసాలాలు తినకూడదు. వేపుళ్లు తగ్గించాలి. రోజూ వేళకు భోజనం చేయాలి. ఆహారాన్ని నెమ్మదిగా, పూర్తిగా నమిలి తినాలి. గబగబా మింగకూడదు. కూల్‌డ్రింకులు, కాఫీ, టీలోని కెఫీన్‌ సైతం ఛాతీ మంటను తెచ్చిపెట్టొచ్చు. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త అవసరం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని