డిటాక్స్‌ ఆహారాలు పనిచేస్తాయా?

బరువు తగ్గటానికో, విషతుల్యాల నిర్మూలనకో కొందరు ప్రత్యేక ‘డిటాక్స్‌’ ఆహార నియమాలు పాటిస్తుంటారు. ఉపవాసం చేయటం, కొన్నిరకాల పదార్థాలే తినటం, కేవలం పానీయాలే తాగటం వంటివన్నీ వీటిలోని భాగాలే.

Updated : 09 Sep 2022 11:55 IST

రువు తగ్గటానికో, విషతుల్యాల నిర్మూలనకో కొందరు ప్రత్యేక ‘డిటాక్స్‌’ ఆహార నియమాలు పాటిస్తుంటారు. ఉపవాసం చేయటం, కొన్నిరకాల పదార్థాలే తినటం, కేవలం పానీయాలే తాగటం వంటివన్నీ వీటిలోని భాగాలే. ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయని, ఒంట్లోంచి హానికర విషతుల్యాలను బయటకు వెళ్లగొడతాయని నమ్ముతుంటారు. ఇటీవల వీటికి ఆదరణ పెరుగుతోంది కూడా. మరి ఇవి సమర్థంగా పనిచేస్తాయా? వీటిపై నాణ్యమైన అధ్యయనాలు పెద్దగా జరగలేదనే చెప్పుకోవాలి. బరువు తగ్గటానికి లేదా విషతుల్యాల నిర్మూలనకు డిటాక్స్‌ ఆహారాలు దోహదం చేస్తున్నట్టు తేలలేదని కొన్ని అధ్యయనాలు చెబుతుండగా.. వీటితో ఒనగూరే ఫలితాలు తాత్కాలికమేనని మరికొన్ని సూచిస్తున్నాయి. తక్కువ కేలరీలు తీసుకోవటం వల్ల కొందరు వీటితో త్వరగా బరువు తగ్గుతుండొచ్చు. దీనికి కారణం కొవ్వుకు బదులు పిండి పదార్థాల నిల్వలు, ద్రవాలు తగ్గటమే. మామూలు ఆహారం ఆరంభించాక తిరిగి అంతే వేగంగా బరువూ పెరుగుతుంది. డిటాక్స్‌ ఆహారాలతో కొన్ని ముప్పులూ పొంచి ఉండొచ్చు. ఏదేమైనా వీటి విషయంలో నిపుణుల సలహా తప్పనిసరి. గుడ్డిగా పాటిస్తే మేలు కన్నా కీడే ఎక్కువ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని