కరోనాకు గోబీ మందు

కొవిడ్‌-19కు మందు ఎప్పుడు వస్తుంది? చాలామంది మదిలో మెదులుతున్న ప్రశ్న. ప్రస్తుతం కొవిడ్‌-19 ఉద్ధృతి తగ్గుండొచ్చు. కానీ ఇంకా పూర్తిగా వదిలి పెట్టలేదు. కొవిడ్‌ జబ్బును తెచ్చిపెట్టే సార్స్‌-కొవీ-2 మన వాతావరణంలో తిరుగుతూనే ఉంది. కొత్త కొత్త రకాలు

Updated : 29 Mar 2022 06:11 IST

కొవిడ్‌-19కు మందు ఎప్పుడు వస్తుంది? చాలామంది మదిలో మెదులుతున్న ప్రశ్న. ప్రస్తుతం కొవిడ్‌-19 ఉద్ధృతి తగ్గుండొచ్చు. కానీ ఇంకా పూర్తిగా వదిలి పెట్టలేదు. కొవిడ్‌ జబ్బును తెచ్చిపెట్టే సార్స్‌-కొవీ-2 మన వాతావరణంలో తిరుగుతూనే ఉంది. కొత్త కొత్త రకాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇవి ఎప్పుడైనా విరుచుకుపడే ప్రమాదం పొంచే ఉంది. అందుకే కొవిడ్‌ను అరికట్టే మందు కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఈ విషయంలో జాన్స్‌ హాప్కిన్స్‌ చిల్డ్రన్స్‌ సెంటర్‌ పరిశోధకుల అధ్యయనం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. క్యాబేజీ, బ్రకోలీ, గోబీ పువ్వు వంటి క్రూసిఫెరస్‌ రకం మొక్కల్లో దండిగా ఉండే సల్ఫోరఫేన్‌ రసాయనం సమర్థంగా పనిచేసే అవకాశముండటమే దీనికి కారణం. ఇది డెల్టా, ఒమిక్రాన్‌తో పాటు సార్స్‌-కొవీ-2 రకాల వైరస్‌ల వృద్ధిని 50% వరకు తగ్గిస్తున్నట్టు ప్రయోగశాల పరీక్షలో గుర్తించారు. మామూలు జలుబును తెచ్చిపెట్టే ఇతరత్రా కరోనా వైరస్‌లనూ నిలువరిస్తున్నట్టు తేలింది. దీన్ని తక్కువ మోతాదులో రెమ్‌డెసివిర్‌ మందుతో కలిపి ఇస్తే మరింత సమర్థంగా పనిచేస్తున్నట్టూ బయటపడింది. సల్ఫోరఫేన్‌కు క్యాన్సర్‌ను నివారించే గుణం ఉన్నట్టు ఇప్పటికే తెలుసు. దీనికి తోడు కరోనా వైరస్‌లనూ మట్టుబెట్టే శక్తి ఉన్నట్టు తేలటం విశేషం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని