రొమ్ముక్యాన్సర్‌ నివారణలో మంచి ఆహారమూ కీలకమే

క్యాన్సర్‌ ముప్పులో ఆహారమూ ప్రభావం చూపుతుంది. అయితే ఎలాంటి ఆహారం క్యాన్సర్‌ నివారణకు తోడ్పడుతుందనేది స్పష్టంగా తెలియదు. మనం తినే ఆహారం నాణ్యత ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నట్టు తాజాగా బయటపడింది.

Published : 21 Jun 2022 01:13 IST

క్యాన్సర్‌ ముప్పులో ఆహారమూ ప్రభావం చూపుతుంది. అయితే ఎలాంటి ఆహారం క్యాన్సర్‌ నివారణకు తోడ్పడుతుందనేది స్పష్టంగా తెలియదు. మనం తినే ఆహారం నాణ్యత ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నట్టు తాజాగా బయటపడింది. ఆరోగ్యకరమైన శాకాహారం.. అంటే పొట్టుతీయని ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, గింజపప్పులు, పప్పులు, వంటనూనెలు, టీ లేదా కాఫీ వంటివి తీసుకునే మహిళలకు రొమ్ముక్యాన్సర్‌ ముప్పు 14 శాతం తగ్గుతున్నట్టు పారిస్‌-సాక్లే యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. అంత ఆరోగ్యకరం కాని శాకాహారం (పండ్ల రసాలు, బాగా పొట్టుతీసిన ధాన్యాలు, బంగాళా దుంపలు, చక్కెరతో చేసిన పానీయాల వంటివి) తినేవారికి రొమ్ముక్యాన్సర్‌ ముప్పు 20 శాతం పెరుగుతున్నట్టు తేలింది. రొమ్ము క్యాన్సర్‌ ఉప రకాలన్నింటికీ ఇది వర్తిస్తుండటం గమనార్హం. నెలసరి నిలిచిన మహిళలను 20 ఏళ్లకు పైగా పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించారు. మంచి శాకాహారాన్ని పెంచుకోవటం.. అదే సమయంలో అనారోగ్యకర శాకాహారాన్ని, మాంసాహారాన్ని తగ్గించుకోటం ద్వారా రొమ్ముక్యాన్సర్‌ ముప్పును నివారించుకోవచ్చని అధ్యయన ఫలితాలు నొక్కి చెబుతున్నాయి. .


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని