ఆహార నియమాలు పాటించినా..

కొందరు ఆహార నియమాలు పాటిస్తున్నా.. వ్యాయామాలు చేస్తున్నా బరువు అంతగా తగ్గరు. దీనికి కారణం బద్ధకంతో కూడిన జీవనశైలి కావొచ్చు. రోజులో ఎక్కువసేపు కదలకుండా ఉండిపోతే ఆహార నియమాలు, వ్యాయామంతో చేకూరే ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది.

Published : 04 Oct 2022 01:07 IST

కొందరు ఆహార నియమాలు పాటిస్తున్నా.. వ్యాయామాలు చేస్తున్నా బరువు అంతగా తగ్గరు. దీనికి కారణం బద్ధకంతో కూడిన జీవనశైలి కావొచ్చు. రోజులో ఎక్కువసేపు కదలకుండా ఉండిపోతే ఆహార నియమాలు, వ్యాయామంతో చేకూరే ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. కొవ్వును కరిగించటంలో లైపేజ్‌ అనే ఎంజైమ్‌ కీలక పాత్ర పోషిస్తుంది. గంటలకొద్దీ అలాగే కూర్చుంటే శరీరం తగినంత లైపేజ్‌ను ఉత్పత్తి చేయలేదు. కాబట్టి రోజంతా చురుకుగా ఉండటం అలవాటు చేసుకోవాలి. గంటకోసారైనా కుర్చీలోంచి లేచి కాసేపు నడవాలి. వీలైతే రెండు మూడు బస్కీలు తీసినా మంచిదే. కంటి నిండా నిద్ర పోకపోయినా బరువు తగ్గకపోవచ్చు. నిద్రలేమితో ఆకలిని ఆపేసే లెప్టిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో జీవక్రియలు నెమ్మదిస్తాయి కూడా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని