ఎండుద్రాక్ష ఎంతో ఘనం!

ఎండుద్రాక్ష ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఛాతీలో మంటను తగ్గిస్తుంది. జీర్ణకోశ వ్యవస్థను సజావుగా పనిచేయిస్తుంది. ఎండుద్రాక్షలో ఒకరకమైన మునెక్కాను నానబెట్టి తినటం మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు కలిగిస్తుంది.

Published : 28 Feb 2023 00:42 IST

ఎండుద్రాక్ష ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఛాతీలో మంటను తగ్గిస్తుంది. జీర్ణకోశ వ్యవస్థను సజావుగా పనిచేయిస్తుంది. ఎండుద్రాక్షలో ఒకరకమైన మునెక్కాను నానబెట్టి తినటం మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు కలిగిస్తుంది. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అయితే మధుమేహం గలవారు వీటిని మితంగానే తినటం మంచిది.

* మునెక్కాలో నీటిలో కరిగే పీచు దండిగా ఉంటుంది. ఇది ఎక్కువెక్కువ తినకుండా చూస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. కొవ్వును కరిగించే లెప్టిన్‌ హార్మోన్‌ మోతాదు పెరిగేలా చేస్తుంది. ఇది జీవక్రియల వేగాన్ని పెంచుతుంది. ఇవన్నీ బరువు తగ్గటానికి తోడ్పడేవే.

* వీటిల్లో కణాల్లో వాపు ప్రక్రియను అణచే, రక్తనాళాల్లో పూడికలను తొలగించే రిస్‌వెరటాల్‌ రసాయనమూ ఉంటుంది. ఇది చెడ్డ కొలెస్ట్రాల్‌ మోతాదులను తగ్గిస్తుంది. రక్తనాళాలు విప్పారేలా చేస్తుంది. దీంతో రక్తపోటు తగ్గుముఖం పడుతుంది. ఇలా గుండెకు మేలు చేస్తుంది.

* దీనిలోని వాపు నివారణ, యాంటీసెప్టిక్‌ గుణాలు నోటి పూత, చిగుళ్లవాపు తగ్గటానికి తోడ్పడతాయి. రోజుకు ఐదారు మునెక్కాలను నములుతుంటే దుర్వాసన, నోట్లో బ్యాక్టీరియా వృద్ధి తగ్గుతాయి.

* మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం, ఫోలేట్‌ వంటివి ఉండటం వల్ల ఎముకలను బలోపేతం చేస్తుంది. ఎముక సాంద్రతను మెరుగు పరుస్తుంది. కీళ్లవాపు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

* వీర్యకణాల సంఖ్య పెరగటానికీ మునెక్కా తోడ్పడుతుంది. రోజూ రాత్రిపూట పాలతో పాటు వీటిని తీసుకుంటే అంగస్తంభనా మెరుగవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని