మెదడును కాపాడుకోండి!

కూల్‌డ్రింకులు, చిప్స్, కుకీస్‌ వంటి అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ అతిగా తీసుకుంటున్నారా? అయితే మరోసారి ఆలోచించుకోండి. వీటితో మతిమరుపు, ఆలోచన సామర్థ్యం తగ్గటం, పక్షవాతం ముప్పు పెరుగుతున్నట్టు బయటపడింది.

Published : 28 May 2024 00:25 IST

కూల్‌డ్రింకులు, చిప్స్, కుకీస్‌ వంటి అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ అతిగా తీసుకుంటున్నారా? అయితే మరోసారి ఆలోచించుకోండి. వీటితో మతిమరుపు, ఆలోచన సామర్థ్యం తగ్గటం, పక్షవాతం ముప్పు పెరుగుతున్నట్టు బయటపడింది. ఈ సమస్యలకు అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ కారణమవుతున్నట్టు రుజువు కాలేదు గానీ వీటి మధ్య సంబంధం ఉంటున్నట్టు మాత్రం వెల్లడైంది. మెదడు ఆరోగ్యంలో ఆహారం కీలకపాత్ర పోషిస్తుంది. అయితే ముఖ్యమైన ఆహార మార్పులేంటనేది కచ్చితంగా తెలియదు. ఈ నేపథ్యంలో 45 ఏళ్లు పైబడ్డవారిలో మసాచుసెట్స్‌ జనరల్‌ హాస్పిటల్‌ పరిశోధకులు ఒక అధ్యయనం నిర్వహించారు. కూల్‌డ్రింకులు, చిప్స్‌ వంటివి తక్కువగా తిన్నవారితో పోలిస్తే వీటిని ఎక్కువగా తిన్నవారికి మెదడు సమస్యల ముప్పు పెరుగుతున్నట్టు గుర్తించారు. అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌లో చక్కెర, ఉప్పు, కొవ్వు ఎక్కువగా.. ప్రొటీన్, పీచు తక్కువగా ఉంటాయి. ఇవి రకరకాల మార్గాల్లో మెదడుకు చేటు చేస్తుండొచ్చని భావిస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని