కళ్లు జాగ్రత్త!

పిల్లలు ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. పరుగెడుతుంటారు, ఆడుతుంటారు, గెంతు తుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు కంటికి దెబ్బలు తగలొచ్చు. కంట్లో దుమ్ము పడొచ్చు. అందువల్ల కళ్లను ఎలా కాపాడుకోవాలో పిల్లలకు ముందుగానే చెప్పటం మంచిది.

Published : 18 Feb 2020 01:27 IST

పిల్లలు ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. పరుగెడుతుంటారు, ఆడుతుంటారు, గెంతు తుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు కంటికి దెబ్బలు తగలొచ్చు. కంట్లో దుమ్ము పడొచ్చు. అందువల్ల కళ్లను ఎలా కాపాడుకోవాలో పిల్లలకు ముందుగానే చెప్పటం మంచిది.
* కళ్లకు బంతో, రాయో, తోటివాళ్ల మోచేయో తగలటం తరచూ చూసేదే. అప్పుడు చాలామంది కంటి మీద చేయి పెట్టుకొని గట్టిగా నొక్కటం చేస్తుంటారు. దీని కన్నా ఐస్‌ ముక్కలతో కూడిన సంచీని 15 నిమిషాల సేపు కళ్ల మీద పెట్టుకోవటం ఎంతో మేలు చేస్తుంది. దీంతో నొప్పి, వాపు తగ్గుముఖం పడతాయి.
* కంట్లో దుమ్ము ధూళి పడ్డప్పుడు చాలామంది చేసే పని చేత్తో కళ్లను నులమటం. ఇది కంటికి హాని చేస్తుంది. దీనికి బదులు నీటితో కళ్లను కడుక్కోవటం మంచి పద్ధతి. కంట్లో ఏవైనా రసాయనాలు పడ్డా ఇలాగే చేయాలి. ఓ 10 నిమిషాల సేపు నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి.
* కంటికి ఎలాంటి దెబ్బ తగలినా దాచి పెట్టకుండా పెద్దవాళ్లకు చెప్పటం మంచిదనే సంగతిని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే డాక్టర్‌కు చూపించటానికి వీలవుతుంది.
* సమతులాహారం తినటం, తగినంత శారీరక శ్రమ, వ్యాయామం, చేతులను కడుకున్న తర్వాతే కళ్లను ముట్టుకోవటం, ఆటలు ఆడుతున్నప్పుడు కళ్లకు తగిన రక్షణ పరికరాలు ధరించటం వంటి జాగ్రత్తలు తీసుకునేలా కూడా చూడాలి. ఇవి కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని