లాలాజల పరీక్షతోనూ..

కరోనా పరీక్ష కోసం ముక్కు లేదా గొంతులో దూదిపుల్లతో నమూనాలు సేకరించాల్సి ఉంటుంది. ఈ సమయంలో...

Published : 12 May 2020 00:28 IST

రోనా పరీక్ష కోసం ముక్కు లేదా గొంతులో దూదిపుల్లతో నమూనాలు సేకరించాల్సి ఉంటుంది. ఈ సమయంలో దగ్గినా, తుమ్మినా వైద్య సిబ్బందిపై తుంపర్లు పడొచ్ఛు పైగా ఈ పరీక్షలను ఎక్కడపడితే అక్కడ చేయటానికి లేదు. కరోనా లక్షణాలు గలవారు పరీక్ష కేంద్రాలకు వచ్చే క్రమంలో వైరస్‌ ఇతరులకు వ్యాపించే ప్రమాదమూ లేకపోలేదు. ఇలాంటి ఇబ్బందులను తొలగించటానికే అమెరికా ఎఫ్‌డీఏ ఇటీవల మొట్టమొదటి లాలాజల పరీక్షకు అనుమతించింది. ఇంట్లోంచే లాలాజలాన్ని సేకరించి ప్రయోగశాలకు పంపిస్తే చాలు. దీంతో వైద్య సిబ్బందికి, ఇతరులకు వైరస్‌ సోకే ముప్పు తగ్గగలదని నిపుణులు భావిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని