భంగిమ పదిలం

కొవిడ్‌-19 దెబ్బకు ఇంటి నుంచి పనిచేయటం పెరిగిపోయింది. ఆఫీసులో మాదిరిగా ఇంట్లో సౌకర్యాలు ఉంటాయా? ల్యాప్‌టాప్‌ను ఒళ్లోనో, నేల మీదో పెట్టుకొని ముందుకు ఒరిగిపోయేవారు కొందరు. డెస్క్‌టాప్‌ ఉన్నా సరైన కుర్చీలేక సతమతమయ్యేవారు గంటల తరబడి

Published : 30 Jun 2020 01:26 IST

కొవిడ్‌-19 దెబ్బకు ఇంటి నుంచి పనిచేయటం పెరిగిపోయింది. ఆఫీసులో మాదిరిగా ఇంట్లో సౌకర్యాలు ఉంటాయా? ల్యాప్‌టాప్‌ను ఒళ్లోనో, నేల మీదో పెట్టుకొని ముందుకు ఒరిగిపోయేవారు కొందరు. డెస్క్‌టాప్‌ ఉన్నా సరైన కుర్చీలేక సతమతమయ్యేవారు గంటల తరబడి అలాగే ఉండిపోతే భంగిమ దెబ్బతింటుంది. మెడనొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలకు దారితీస్తుంది. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. డెస్క్‌ ముందు కూర్చున్నప్పుడు పాదాలు పూర్తిగా నేలకు ఆనించి ఉంచాలి. తొడలు నేలకు సమాంతరంగా.. కుర్చీ చివరి భాగం, మోకాళ్ల మధ్య కాసింత దూరం ఉండేలా చూసుకోవాలి. కంప్యూటర్‌ పైభాగం కంటికి సమానంగా లేదా కాస్త కిందుగా ఉండాలి. మధ్యమధ్యలో లేచి అటూఇటూ నాలుగడుగులు వేయాలి. కాళ్లు, చేతులు, వేళ్లు, నడుమును సాగదీస్తూ కండరాల మీద పడే ఒత్తిడిని తగ్గించుకోవాలి. తేలికైన యోగాసనాలు వేసినా సరే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని