ఫ్యాషన్‌ మాస్కులైనా..

కరోనా విజృంభిస్తున్న తరుణంలో రకరకాల మాస్కులు ధరించటం చూస్తూనే ఉన్నాం. కొందరు తమ దుస్తుల రంగులను పోలినవి ధరిస్తుంటే..

Published : 07 Jul 2020 00:41 IST

కరోనా విజృంభిస్తున్న తరుణంలో రకరకాల మాస్కులు ధరించటం చూస్తూనే ఉన్నాం. కొందరు తమ దుస్తుల రంగులను పోలినవి ధరిస్తుంటే.. మరికొందరు రకరకాల డిజైన్లతో కూడినవి వేసుకుంటున్నారు. ఇవెలా ఉన్నప్పటికీ మాస్కు ధారణ ప్రధాన ఉద్దేశం మన నుంచి ఇతరులకు హాని కలగకుండా చూడటం. అందరమూ మాస్కులు ధరిస్తే కరోనా వైరస్‌ వ్యాప్తిని తగ్గించొచ్ఛు అందరమూ సురక్షితంగా ఉండొచ్ఛు ఫ్యాషన్‌ మాస్కులైనా నిరభ్యంతరగా ధరించొచ్ఛు కాకపోతే సరైన పద్ధతిలో తయారుచేసినవై ఉండాలి.●

* మాస్కు మరీ పలుచగా ఉండకూడదు. వస్త్రాన్ని పొరలు పారలుగా మలచి తయారుచేసినదైతే మంచిది.

* మాస్కు ధరించినప్పుడు శ్వాస తేలికగా ఆడేలా ఉండాలి.

* ముక్కు పైభాగం నుంచి గదమ కింది వరకూ పూర్తిగా మూసేసేంత పెద్దగా ఉండాలి.

* మాస్కు కిందికి జారిపోకూడదు. చర్మానికి మాస్కు గట్టిగా ఆనుకునేలా చెవులకు తగిలించే పట్టీలు బిగుతుగా ఉండాలి. లేదా పట్టీలు తల వెనక నుంచి కట్టుకునేంత పెద్దగా ఉండాలి.

* గుడ్డతో చేసిన మాస్కులైతే రోజూ ఉతుక్కోవాలి. ఉతికిన తర్వాత వాటి ఆకారం చెడిపోకూడదు, దెబ్బతినకూడదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని