ఛాతీ సీటీ స్కాన్‌ ఎప్పుడు?

కరోనా జబ్బు వచ్చిందనగానే చాలామంది మొదట్లోనే ఛాతీ సీటీస్కాన్‌ చేయించుకుంటున్నారు. ఇది కరోనా మూలంగా ఊపిరితిత్తుల్లో తలెత్తే మార్పులను పసిగట్టటానికే తప్ప జబ్బు నిర్ధారణకు కాదనే సంగతిని గుర్తించాలి.

Published : 27 Apr 2021 01:21 IST

రోనా జబ్బు వచ్చిందనగానే చాలామంది మొదట్లోనే ఛాతీ సీటీస్కాన్‌ చేయించుకుంటున్నారు. ఇది కరోనా మూలంగా ఊపిరితిత్తుల్లో తలెత్తే మార్పులను పసిగట్టటానికే తప్ప జబ్బు నిర్ధారణకు కాదనే సంగతిని గుర్తించాలి. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష పాజిటివ్‌గా ఉండి ఆక్సిజన్‌ శాతం తగ్గుతుంటే, ఏడు రోజులైనా జ్వరం తగ్గకుండా వేధిస్తుంటే.. అప్పుడు ఛాతీ సీటీ స్కాన్‌ అవసరమవుతుంది. ఆర్‌టీపీసీఆర్‌ నెగెటివ్‌గా ఉన్నప్పటికీ జ్వరం తగ్గకుండా పెరుగుతూ వస్తున్నా, ఆక్సిజన్‌ తగ్గుతున్నా సీటీస్కాన్‌ అవసరపడొచ్చు. ఎందుకంటే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలో నమూనా స్రావాలను సరిగా తీయటం చాలా ముఖ్యం. లేకపోతే ఒంట్లో వైరస్‌ ఉన్నా కూడా ఫలితం నెగెటివ్‌గా తేలొచ్చు. దీంతో జ్వరం వస్తూనే ఉంటుంది. సమస్య తీవ్రమైతే ఆక్సిజన్‌ తగ్గుతూ వస్తుంది. ఇలాంటివారికి సీటీస్కాన్‌ అవసరమవుతుంది. ఇది సమస్యను ముందే పట్టుకోవటానికి తోడ్పడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని