Semaglutide Injection: బరువుకో ఇంజెక్షన్‌!

ఊబకాయులకు శుభవార్త. బరువు తగ్గటానికి సెమగ్లుటైడ్‌ ఇంజెక్షన్‌ను అనుబంధ చికిత్సగా వాడుకోవటానికి అమెరికా ఎఫ్‌డీఏ ఇటీవలే అనుమతించింది. శరీర బరువు ఎత్తు నిష్పత్తి (బీఎంఐ) 30, అంతకన్నా ఎక్కువ ఉన్న ఊబకాయులకు.. అధిక బరువు గలవారికైతే బీఎంఐ 27, అంతకన్నా ఎక్కువున్నవారికి దీన్ని సిఫారసు చేశారు.

Updated : 08 Jun 2021 08:09 IST


ఊబకాయులకు శుభవార్త. బరువు తగ్గటానికి సెమగ్లుటైడ్‌ ఇంజెక్షన్‌ను అనుబంధ చికిత్సగా వాడుకోవటానికి అమెరికా ఎఫ్‌డీఏ ఇటీవలే అనుమతించింది. శరీర బరువు ఎత్తు నిష్పత్తి (బీఎంఐ) 30, అంతకన్నా ఎక్కువ ఉన్న ఊబకాయులకు.. అధిక బరువు గలవారికైతే బీఎంఐ 27, అంతకన్నా ఎక్కువున్నవారికి దీన్ని సిఫారసు చేశారు. ఊబకాయం, అధిక బరువుతో పాటు అధిక రక్తపోటు, టైప్‌2 మధుమేహం, అధిక కొలెస్ట్రాల్‌ వంటి సమస్యల్లో ఏదో ఒకదాంతో బాధపడుతున్నవారు దీనికి అర్హులు. అదీ ఆహారంలో కేలరీలు తగ్గించుకోవటం, వ్యాయామం వంటివి పాటిస్తూనే దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. మధుమేహుల్లో గుండెజబ్బుల నివారణకు దీన్ని ఇప్పటికే వాడుతుండగా.. తాజాగా ఊబకాయ చికిత్సకు అనుమతించటం గమనార్హం. జీవనశైలి మార్పులను పాటించటంతో పాటు సెమగ్లుటైడ్‌ను తీసుకున్నవారిలో సుమారు 70% మందిలో 10%, అంతకన్నా ఎక్కువ బరువు తగ్గినట్టు బయటపడింది. కొందరిలో 15% వరకూ బరువు తగ్గటం విశేషం. కాకపోతే థైరాయిడ్‌ క్యాన్సర్‌, పాంక్రియాస్‌ వాపు వంటి సమస్యలు గలవారు దీన్ని వాడకూడదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని