వంగితే నష్టమే!

కొందరు ఎప్పుడూ మెడను వంచి ముందుకు వంగిపోతుంటారు. దీంతో కొందరు గూని వచ్చినట్టుగానూ కనిపిస్తుంటారు. వెన్నెముక ముందుకు వంగిపోయినప్పుడు ఊపిరితిత్తులు విప్పారటానికి తగినంత స్థలం దొరకదు.

Updated : 19 Oct 2022 15:59 IST

కొందరు ఎప్పుడూ మెడను వంచి ముందుకు వంగిపోతుంటారు. దీంతో కొందరు గూని వచ్చినట్టుగానూ కనిపిస్తుంటారు. వెన్నెముక ముందుకు వంగిపోయినప్పుడు ఊపిరితిత్తులు విప్పారటానికి తగినంత స్థలం దొరకదు. దీంతో ఆక్సిజన్‌ అంతగా అందదు. అదేపనిగా ముందుకు వంగిపోతుండటానికి అలవాట్లు, పనుల వంటివీ కారణం కావొచ్చు. అందువల్ల భంగిమను సరిచేసుకోవాలి. కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వ్యాయామంగా- గోడకు వీపును ఆనించి, పాదాలను కాస్త ఎడంగా పెట్టి తిన్నగా నిల్చోవాలి. తల, భుజాలు, తుంటి, మడమలు గోడకు తాకేలా చూసుకోవాలి. అలాగే కుర్చీలో కూర్చున్నప్పుడు, వాహనాలు నడుపుతున్నప్పుడు చిన్న తువ్వాలును చుట్టి వీపు కింది భాగాన పెట్టుకోవాలి. పడుకున్నప్పుడు దిండు మరీ ఎత్తుగా లేకుండానూ చూసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని