కొవిడ్‌ టీకాతో గర్భస్రావమేమీ కాదు

గర్భిణులకు కొవిడ్‌-19 టీకా సురక్షితమేనని మరోసారి రుజువైంది. టీకాతో తొలి మూడు నెలల్లో గర్భస్రావమయ్యే ముప్పేమీ పెరగటం లేదని న్యూ ఇంగ్లాండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. టీకా తీసుకున్నవారిలో తొలి మూడు నెలల్లో గర్భస్రావమైనవారి, ఇంకా గర్భం నిలిచి ఉన్నవారి నిష్పత్తిని

Published : 26 Oct 2021 00:20 IST

ర్భిణులకు కొవిడ్‌-19 టీకా సురక్షితమేనని మరోసారి రుజువైంది. టీకాతో తొలి మూడు నెలల్లో గర్భస్రావమయ్యే ముప్పేమీ పెరగటం లేదని న్యూ ఇంగ్లాండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. టీకా తీసుకున్నవారిలో తొలి మూడు నెలల్లో గర్భస్రావమైనవారి, ఇంకా గర్భం నిలిచి ఉన్నవారి నిష్పత్తిని పరిశోధకులు పోల్చి చూసి ఈ విషయాన్ని తేల్చారు. కొవిడ్‌-19 టీకా తీసుకున్నాక తొలి నెలల్లో గర్భస్రావ ముప్పు పెరుగుతుందనటానికి ఎలాంటి రుజువులూ లభించలేదని యూనివర్సిటీ ఆఫ్‌ ఒటావా పరిశోధకులు డాక్టర్‌ దేషాయ్నే ఫెల్‌ పేర్కొంటున్నారు. గర్భధారణ సమయంలో టీకా సురక్షితమేననే విషయాన్ని ఇది బలపరుస్తోందని వివరిస్తున్నారు. మనదేశంలోనూ గర్భిణులకు కొవిడ్‌-19 టీకాను అనుమతించిన విషయం తెలిసిందే. అయితే పిండం మీద దుష్ప్రభావాలు చూపొచ్చన్న భయంతో కొందరు దీన్ని తీసుకోవటానికి వెనకాడుతున్నారు. ఇలాంటి సందేహాలేవీ అవసరం లేదని తాజా అధ్యయనం నొక్కి చెప్పినట్టయ్యింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు