సానుకూల కృతజ్ఞత!

భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలనుకుంటున్నారా? కృతజ్ఞత భావాన్ని అలవరచుకోండి. ఎవరైనా సాయం చేసినప్పుడో, ఏదైనా బహుమతి ఇచ్చినప్పుడో ‘ధన్యవాదాలు’ చెప్పటం మామూలే. ఇది కేవలం మాటలకే పరిమితమయ్యేది కాదు.

Published : 14 Dec 2021 01:01 IST

భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలనుకుంటున్నారా? కృతజ్ఞత భావాన్ని అలవరచుకోండి. ఎవరైనా సాయం చేసినప్పుడో, ఏదైనా బహుమతి ఇచ్చినప్పుడో ‘ధన్యవాదాలు’ చెప్పటం మామూలే. ఇది కేవలం మాటలకే పరిమితమయ్యేది కాదు. మానసికంగానూ దీర్ఘకాలం మంచి ప్రభావం చూపుతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. సానుకూల భావనలు పెంపొందిస్తుంది. సహజ యాంటీ డిప్రెసెంట్‌గానూ పనిచేస్తుంది. కృతజ్ఞతలు తెలిపినప్పుడు, స్వీకరించినప్పుడు మెదడులో డొపమైన్‌, సెరటోనిన్‌ అనే నాడీ సమాచార వాహకాలు విడుదలవుతాయి. ఇవి మనసును ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచుతాయి. ఇతరులకే కాదు.. మనకు మనమూ, ప్రకృతికీ కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు. నిద్రలేవగానే ఇందుకు కొంత సమయం కేటాయించుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని