కొవిడ్‌కు మలేరియా మందు

ఒమిక్రాన్‌ రకం వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న తరుణంలో కొవిడ్‌-19కు సమర్థమైన చికిత్సలను రూపొందించటం అత్యావశ్యకంగా మారింది. ఇందుకోసం వైద్య నిపుణులు మొదట్నుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. పాత మందులను

Updated : 21 Dec 2021 06:12 IST

మిక్రాన్‌ రకం వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న తరుణంలో కొవిడ్‌-19కు సమర్థమైన చికిత్సలను రూపొందించటం అత్యావశ్యకంగా మారింది. ఇందుకోసం వైద్య నిపుణులు మొదట్నుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. పాత మందులను వినియోగించుకోవటంపైనా దృష్టి సారించారు. అప్పట్లో మలేరియా చికిత్సలో వాడే క్లోరోక్విన్‌ మందు విశేష ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. అయితే దీంతో అంత ఉపయోగం లేకపోవటం, పైగా దుష్ప్రభావాలు తలెత్తే ప్రమాదముండటంతో పక్కన పెట్టేశారు. తాజాగా అటోవాక్వోన్‌ అనే మరో మలేరియా మందు తెరపైకి వచ్చింది. ఇది మనుషుల ఊపిరితిత్తుల్లో కరోనా వైరస్‌ (అల్ఫా, బీటా, డెల్టా రకాలు) ఇన్‌ఫెక్షన్‌ను అడ్డుకుంటున్నట్టు అర్హస్‌ యూనివర్సిటీ అధ్యయనంలో బయటపడింది. అటోవాక్వోన్‌తో కూడిన మాత్రలు వేసుకునేవారికి కొవిడ్‌-19 నుంచి కొంత రక్షణ లభిస్తున్నట్టు కెనడాలో గుర్తించిన నేపథ్యంలో ఈ అధ్యయనం నిర్వహించారు. ఇది కొవిడ్‌ కారక సార్స్‌-కొవీ-2 వైరస్‌ ముల్లు ప్రొటీన్‌ను ఏస్‌2 గ్రాహకాలకు అంటుకోనీయకపోవటం, వైరస్‌ వృద్ధిని నిలువరించటం ద్వారా ఇన్‌ఫెక్షన్‌ను అడ్డుకుంటోందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాపు ప్రక్రియను ప్రేరేపించే సూచికలు వ్యక్తం కాకుండానూ చూస్తోందని చెబుతున్నారు. కొవిడ్‌కు దీని వినియోగంపై కొన్ని ప్రయోగ పరీక్షలు జరుగుతున్నాయి. మంచి ఫలితాలు వెల్లడైతే కొవిడ్‌ చికిత్సకు కొత్త మందు దొరికినట్టేనని భావించొచ్చు. ఇది జికా, డెంగీ వైరస్‌ ఇన్‌ఫెక్షన్లనూ ఎదుర్కొంటున్నట్టు గత అధ్యయనాల్లో తేలింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని